త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Om Birla | లోక్‌స‌భ‌లో కొన‌సాగుతున్న గంద‌ర‌గోళం.. స్పీక‌ర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం..?

Om Birla | స్పీక‌ర్ ఓం బిర్లా (Om Birla)పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్ర‌తిప‌క్షాలు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది (Opposition to move no confidence motion against Speaker Om Birla).

D

National | Published On Feb 9, 2026, 12.04 pm IST

Om Birla | లోక్‌స‌భ‌లో కొన‌సాగుతున్న గంద‌ర‌గోళం.. స్పీక‌ర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం..?
Advertisement

Om Birla | పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో (Parliament Budget Session) గంద‌ర‌గోళం కొన‌సాగుతోంది. సోమ‌వారం ఉద‌యం కూడా ఉభ‌య స‌భ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. లోక్‌స‌భ ప్రారంభంకాగానే విప‌క్ష కూట‌మి ఎంపీలు నిర‌స‌నకు దిగారు. దీంతో స‌భ ప్రారంభ‌మైన ఐదు నిమిషాల్లోనే వాయిదా ప‌డింది. ఎంపీలు ఆందోళ‌న చేస్తూ స‌భా కార్య‌క‌లాపాల‌ను అడ్డుకుంటుండ‌టంతో స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కూ వాయిదా వేశారు.

ఇదిలా ఉండ‌గా.. స్పీక‌ర్ ఓం బిర్లా (Om Birla)పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్ర‌తిప‌క్షాలు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది (Opposition to move no confidence motion against Speaker Om Birla). చైనా అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే (Ex Army chief General MM Naravane) త‌న పుస్త‌కంలో రాసుకున్న కొన్ని అంశాల‌ను రాహుల్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించ‌డంతో లోక్‌స‌భ‌లో గంద‌రోగ‌ళం త‌లెత్తిన విష‌యం తెలిసిందే. రాహుల్ ప్ర‌సంగాన్ని అధికార ప‌క్షం ఎంపీలు అడ్డుకోవ‌డంపై కాంగ్రెస్ ఎంపీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. స‌భ‌లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌కు దిగాయి. దీంతో ఎనిమిది మంది ఎంపీల‌ను స్పీక‌ర్ సెష‌న్ మొత్తం స‌భ నుంచి స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామాల‌పై ఆగ్ర‌హంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టేందుకు రెఢీ అయిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ్యాంగంలోని 94సీ ప్ర‌కారం.. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌తిప‌క్ష ఎంపీలు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.

ఇదీ ర‌గ‌డ..

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై ప్ర‌సంగం సంద‌ర్భంగా లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా చైనా అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే (Ex Army chief General MM Naravane) త‌న పుస్త‌కంలో రాసుకున్న కొన్ని అంశాల‌ను రాహుల్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ఆ వివ‌రాల‌ను ఓ మ్యాగ‌జైన్ ప్ర‌చురించింది. మ్యాగ‌జైన్‌లో ప్ర‌చురించిన పేజీల‌ను స‌భ‌లో రాహుల్ చూపించారు. అయితే, అధికార పక్షం రాహుల్ ప్ర‌సంగాన్ని అడ్డుకుంది.

ప‌బ్లిష్ కాని పుస్త‌కంలోని అంశాల‌ను రాహుల్ ప్ర‌స్తావిస్తున్నారంటూ ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మండిప‌డ్డారు. ప్రచురించని పుస్తకాన్ని ఉటంకించడం సభ నియమాలకు విరుద్ధమన్నారు. ర‌క్ష‌ణ మంత్రితోపాటూ హోంమంత్రి అమిత్ షా, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి కిర‌ణ్ రిజుజు కూడా రాహుల్ వ్యాఖ్య‌ల‌ను కొట్టిపారేశారు. ఈ క్ర‌మంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది.

స్పీక‌ర్ ఏమ‌న్నారంటే..

ర‌గ‌డ‌పై లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా స్పందించారు. న్యూస్ పేప‌ర్ క్లిప్పింగ్స్‌, ప‌బ్లిష్ కాని పుస్త‌కాల‌కు సంబంధించిన విష‌యాల‌ను లోక్‌స‌భ‌లో ప్ర‌స్తావించ‌కూడ‌ద‌ని సూచించారు. ఈ మేర‌కు రూల్ బుక్ నియ‌మాల‌ను స‌భ‌లో చ‌దివి వినిపించారు. ఈ నియ‌మాల ప్ర‌కారం.. పబ్లిష్ కాని పుస్త‌కంలోని వివ‌రాల‌ను స‌భ‌లో చ‌ర్చించ‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు.

అయినా రాహుల్ వినిపించుకోలేదు. ఆ పుస్త‌కంలోని వివ‌రాల‌ను ప్ర‌స్తావించేందుకు ప్ర‌య‌త్నించారు. దీనిపై లోక్‌సభలో గందరగోళం నెల‌కొంది. ఫ‌లితంగా రాష్ట్రపతి ప్ర‌సంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగం లేకుండానే తీర్మానించాల్సి వ‌చ్చింది.

స్పీక‌ర్ ఓం బిర్లాకు రాహుల్ లేఖ‌..

మ‌రోవైపు స‌భ‌లో త‌న‌కు మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం లేదంటూ రాహుల్‌.. స్పీక‌ర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇలా చేయ‌డం స‌భ సంప్ర‌దాయాల‌ను ఉల్లింఘించ‌డ‌మే అవుతుంద‌న్నారు. ఇందుకు సంబంధించిన లేఖ‌ను కాంగ్రెస్ ఫార్టీ ఎక్స్‌లో కూడా పోస్టు చేసింది. ఈ మేరకు మోదీ ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించింది.

Advertisement
Advertisement