CEC Gyanesh Kumar | జ్ఞానేశ్.. ఇక దిగిపో..
CEC Gyanesh Kumar | వివాదాస్పద నిర్ణయాలతో ఒంటెత్తు వైఖరితో పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ ఎలక్షన్ కమిషర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ముప్పేట దాడి మొదలైంది. ఆయన పదవి నుంచి దిగిపోవాలంటూ కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసనకు
విపక్షాలతో కాంగ్రెస్ మంతనాలు
రెండు సభల్లోనూ తీర్మానానికి కసరత్తు
రెండు వారాల్లో నోటీసు ఇచ్చేందుకు సిద్ధం
సీఈసీ రాజీనామా చేయాల్సిందే: కాంగ్రెస్
మోదీ, అమిత్ షాలపై విచారణ జరపాలి : రాహుల్ గాంధీ
సర్ ప్రక్రియను ఆపేయండి : లెఫ్ట్
48 గంటల్లో రాజీనామా చేయకపోతే
దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం : సీజేపీ
సీఈసీపై క్రిమినల్ కంటెంప్ట్ నమోదుకు
సుప్రీంను ఆశ్రయించిన న్యాయవాది
సర్.. రాజ్యాంగ విరుద్ధం : మాజీ సీఈసీ ఖురేషీ
దిమాగీ నక్సల్సే సీఈసీని టార్గెట్ చేస్తున్నారు: అసోం సీఎం
CEC Gyanesh Kumar | త్రినేత్ర న్యూస్ : వివాదాస్పద నిర్ణయాలతో ఒంటెత్తు వైఖరితో పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ ఎలక్షన్ కమిషర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ముప్పేట దాడి మొదలైంది. ఆయన పదవి నుంచి దిగిపోవాలంటూ కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు.. ఆయనపై పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. సీఈసీ 48 గంటల్లో రాజీనామా చేయాలని లేకపోతే తాము దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ అల్టిమేటం జారీ చేసింది. మరోవైపు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమినల్ కంటెప్ట్ కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ లాయరు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కాగా.. సీఈసీ పనితీరు సరిగ్గానే ఉందని దిమాగీ నక్సల్సే ఆయనను లక్ష్యంగా చేసుకొని కట్టు కథలు అల్లుతున్నారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.. ప్రతిపక్షాల దాడిని తిప్పికొట్టారు.
వాళ్లే దేశ ద్రోహులు : రాహుల్ గాంధీ
సీఈసీ జ్ఞానేశ్ పనితీరుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం విలేకరులతో మాట్లాడారు. ఓటు చోరీపై ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. "జ్ఞానేశ్ కుమార్ తక్షణం రాజీనామా చేయాలి. మోదీ, అమిత్ షాలు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఓట్లు దొంగిలించారు. ఓటు చోరీ చేసి గెలిచిన ఎంపీలు చేసిన చట్టాలు న్యాయ విరుద్ధం. ఓటు చోరీకి గురైతే ఇక రాజ్యాంగం కూడా చోరీకి గురైనట్టే. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఆ ఇద్దరిపైన కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశించాలి" అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
జ్ఞానేశ్ కుమార్ అప్రూవర్‌గా మారాలి
జ్ఞానేశ్‌కుమార్ అప్రూవర్‌గా మారాలని.. అది దేశ ప్రయోజనాలకు మంచిదని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత సీఈసీని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా ఎంపిక చేశారని రాహుల్ అన్నారు. ప్రస్తుత గందరగోళానికి ఆయనే కారణమని ఇద్దరు కమిషనర్లు చెబుతున్న నేపథ్యంలో.. ఎంపిక చేసిన వాళ్లే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పార్లమెంటులో అభిశంసన తీర్మానం
కాగా.. సీఈసీపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇతర విపక్షాలతో సంప్రదింపులు ప్రారంభించింది. అయితే.. కాంగ్రెస్ తరహాలోనే తృణమూల్, లెఫ్ట్, ఎస్పీ, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, డీఎంకే పార్టీలు సీఈసీ రాజీనామాకు పట్టుబడుతున్నాయి. సర్ ప్రక్రియ కోసం ఎన్నికల కమిషన్ వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్ వివరాలు అడిగితే.. అవి అత్యంత రహస్యమని.. జవాబు రావడం.. అనేక అనుమానాలకు తావిస్తున్నదని తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే అన్నారు.
ఇక చాలు జ్ఞానేశ్.. ఇక చాలు : సీజేపీ
దేశంలో పారదర్శక పూర్వకంగా ఎన్నికలు జరగాలంటే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణం రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే డిమాండ్ చేశారు. 48 గంటల్లో ఆయన రాజీనామా చేయకపోతే.. దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని భావిస్తే.. ప్రతిపక్ష పార్టీలు వెంటనే ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కాగా.. సర్ ప్రక్రియ చట్ట విరుద్ధమని.. మాజీ సీఈసీ ఖరేషీ చెప్పారు. సీఈసీ ఒక్కరే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరని.. మిగతా ఇద్దరు కమిషనర్లతో మాట్లాడిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తారని అసోం సీఎం హిమంతా.. ఆయనను వెనకేసుకొచ్చారు. దిమాగీ నక్సల్స్ ఆయనను టార్గెట్ చేస్తున్నాయని.. ఇదంతా ఓ పొలిటికల్ స్టంట్ అని విమర్శించారు.
తాజావార్తలు
- ●Rashmika Mandanna | క్రష్ తగ్గడం లేదు - భర్తపై రష్మిక పోస్ట్ - విజయ్ క్యూట్ రిప్లై
- ●CP Ramesh admire to Shashikumar | శభాష్ శశికుమార్.. నీ మానవత్వం ఎందరికో స్ఫూర్తి
- ●Cheyutha Pensions | చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలనకు గడువు పొడిగింపు
- ●Rahul Gandhi Gyanesh Kumar Deshdrohi | నువ్వు దేశద్రోహివి
- ●CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తమ ప్రజా సేవ అవార్డు
- ●Catherine | స్పెషల్ సాంగ్‌తో జాక్‌పాట్ - హీరోయిన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్

Rashmika Mandanna | క్రష్ తగ్గడం లేదు - భర్తపై రష్మిక పోస్ట్ - విజయ్ క్యూట్ రిప్లై

CP Ramesh admire to Shashikumar | శభాష్ శశికుమార్.. నీ మానవత్వం ఎందరికో స్ఫూర్తి

Cheyutha Pensions | చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలనకు గడువు పొడిగింపు

Rahul Gandhi Gyanesh Kumar Deshdrohi | నువ్వు దేశద్రోహివి





