త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్త‌మ ప్ర‌జా సేవ అవార్డు

CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ - 2026’ బెస్ట్ ప‌బ్లిక్ స‌ర్వెంట్-2026 అవార్డుకు ఎంపిక‌య్యారు. కేరళకు చెందిన దిగ్గ‌జ కాంగ్రెస్ నేత‌, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది.

S

Telangana | Published On Sep 24, 2026, 6.39 pm IST

CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్త‌మ ప్ర‌జా సేవ అవార్డు
Advertisement

రేపు కేర‌ళలో అవార్డు ప్ర‌దానోత్స‌వం
రైతు, బీసీ, ప్రజా సంక్షేమ పాల‌న‌కు గుర్తింపు

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ - 2026’ బెస్ట్ ప‌బ్లిక్ స‌ర్వెంట్-2026 అవార్డుకు ఎంపిక‌య్యారు. కేరళకు చెందిన దిగ్గ‌జ కాంగ్రెస్ నేత‌, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి సీఎం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టి గల నాయకత్వానికి గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు ఫౌండేషన్ వర్కింగ్ ఛైర్మ‌న్‌, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌక‌త్ తెలిపారు. ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని నిలంబూర్‌లో 25న ఉద‌యం 10 గంటలకు సీఎంకు ప్ర‌దానం చేయ‌నున్నారు. పురస్కారం కింద రూ. లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేస్తారు.

Advertisement
Advertisement