త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కేసీఆర్‌ను ఏ ‘స‌ర్’ కూడా ఓడించ‌లేదు

KTR | తెలంగాణ‌లో కొన‌సాగుత‌న్న 'స‌ర్' ప్ర‌క్రియ‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాల్లోనే అత్య‌ధికంగా ఓట‌ర్ల‌ను తొల‌గించినా ఆశ్చ‌ర్యం లేదు అని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌లో ఒకే ఒక్క పోరాటం జ‌రుగుతుంది.. అది కేసీఆర్ వ‌ర్సెస్ అంద‌రూ అని పేర్కొన్నారు.

S

Telangana | Published On Sep 24, 2026, 6.20 pm IST

KTR | కేసీఆర్‌ను ఏ ‘స‌ర్’ కూడా ఓడించ‌లేదు
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ‌లో కొన‌సాగుత‌న్న 'స‌ర్' ప్ర‌క్రియ‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాల్లోనే అత్య‌ధికంగా ఓట‌ర్ల‌ను తొల‌గించినా ఆశ్చ‌ర్యం లేదు అని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌లో ఒకే ఒక్క పోరాటం జ‌రుగుతుంది.. అది కేసీఆర్ వ‌ర్సెస్ అంద‌రూ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ ఒక అప‌విత్ర‌, అక్ర‌మ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే ఎన్నిక‌ల సంఘం కూడా ఆ కూట‌మితో చేతులు క‌లిపిన‌ట్లు క‌నిపిస్తోందన్నారు. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌జ‌ల‌తో క‌లిసి న్యాయ‌స్థానాల్లోనూ బీఆర్ఎస్ పోరాటం చేస్తుంద‌న్నారు. అక్ర‌మంగా తొల‌గించిన ప్ర‌తి ఓటును తిరిగి చేర్పిస్తామ‌ని చెప్పారు. మ‌ళ్లీ మీకు ఒక్క‌సారి గుర్తు చేస్తున్నా.. తెలంగాణ‌లో ఒకే ఒక్క సార్ ఉన్నారు.. ఆయ‌నే కేసీఆర్ సార్. ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న ప్రేమ‌ను ఏ స‌ర్ కూడా ఓడించ‌లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement