Rashmika Mandanna | క్రష్ తగ్గడం లేదు – భర్తపై రష్మిక పోస్ట్ – విజయ్ క్యూట్ రిప్లై
పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తొలి మూవీ రణబాలి దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతుంది. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. రణబాలి నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఇటీవల రిలీజ్ చేశారు.
Naresh N
Entertainment | Published On Sep 24, 2026, 7.28 pm IST

ఎందయ్యా సామీ ఇట్ట గాస్తంది ఎన్నెలా అంటూ సాగిన ఈ రొమాంటిక్ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది.

ఈ పాటలో విజయ్, రష్మిక కెమిస్ట్రీ బాగా కుదిరిందని నెటిజన్లు అంటున్నారు.

రణబాలి సాంగ్ తాలూకు స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక మందన్న. భర్త విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఫొటోకు ఓ క్యాప్షన్ ఇచ్చింది.

జీవిత భాగస్వామిగా పూర్తిగా నాకే సొంతం అయ్యాడు. అయినా అతడిపై క్రష్ తగ్గడం లేదంటూ రష్మిక మందన్న పేర్కొన్నది.

రష్మిక పోస్ట్‌పై విజయ్ దేవరకొండ క్యూట్ రిప్లై ఇచ్చాడు. నేను ఎంతో లక్కీ. జయమ్మను మిస్సయిన నువ్వు మాత్రం జీవితాంతం నాతోనే ఉంటావు అంటూ బదులిచ్చాడు.

విజయ్, రష్మిక మందన్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రణబాలిలో వీరిద్దరు భార్యాభర్తలుగానే కనిపించబోతున్నారు.

గీతగోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ ఇది.
తాజావార్తలు
- ●CP Ramesh admire to Shashikumar | శభాష్ శశికుమార్.. నీ మానవత్వం ఎందరికో స్ఫూర్తి
- ●CEC Gyanesh Kumar | జ్ఞానేశ్.. ఇక దిగిపో..
- ●Cheyutha Pensions | చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలనకు గడువు పొడిగింపు
- ●Rahul Gandhi Gyanesh Kumar Deshdrohi | నువ్వు దేశద్రోహివి
- ●CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తమ ప్రజా సేవ అవార్డు
- ●Catherine | స్పెషల్ సాంగ్‌తో జాక్‌పాట్ - హీరోయిన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్

CP Ramesh admire to Shashikumar | శభాష్ శశికుమార్.. నీ మానవత్వం ఎందరికో స్ఫూర్తి

CEC Gyanesh Kumar | జ్ఞానేశ్.. ఇక దిగిపో..

Cheyutha Pensions | చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలనకు గడువు పొడిగింపు

Rahul Gandhi Gyanesh Kumar Deshdrohi | నువ్వు దేశద్రోహివి


