త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Om Birla | స్పీక‌ర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు

Om Birla | పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. లోక్‌స‌భ స్పీక‌ర్ (Lok Sabha Speaker ) ఓం బిర్లా (Om Birla)పై విప‌క్ష ఇండియా కూట‌మి ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు.

D

National | Published On Feb 10, 2026, 3.19 pm IST

Om Birla | స్పీక‌ర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు
Advertisement

Om Birla | పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. లోక్‌స‌భ స్పీక‌ర్ (Lok Sabha Speaker ) ఓం బిర్లా (Om Birla)పై విప‌క్ష ఇండియా కూట‌మి ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 1:14 గంట‌ల‌కు కాంగ్రెస్ ఎంపీలు లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు నోటీసులు అంద‌జేశారు.

రాజ్యాంగంలోని 94సీ ప్ర‌కారం.. ఈ నోటీసులు ఇచ్చారు. ఈ అవిశ్వాసం నోటీసుల‌పై 120 మంది ఎంపీలు సంత‌కాలు చేసిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ ఎంపీలు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. అయితే, టీఎంసీ మాత్రం అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంత‌కాలు చేసేందుకు నిరాక‌రించిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు ఈ నోటీసులో లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత‌, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా సంత‌కం చేయ‌లేద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి.

రాజ్యాంగంలోని 94సీ ప్ర‌కారం సాధారణంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఆ ప్రకారం బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో అవిశ్వాస తీర్మనం సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్ తొలి విడత సమావేశాలు జనవరి 8న ప్రారంభమై ఫిబ్రవరి 13న ముగియనున్నాయి. రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

ఇదీ ర‌గ‌డ..

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై ప్ర‌సంగం సంద‌ర్భంగా లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా చైనా అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే (Ex Army chief General MM Naravane) త‌న పుస్త‌కంలో రాసుకున్న కొన్ని అంశాల‌ను రాహుల్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ఆ వివ‌రాల‌ను ఓ మ్యాగ‌జైన్ ప్ర‌చురించింది. మ్యాగ‌జైన్‌లో ప్ర‌చురించిన పేజీల‌ను స‌భ‌లో రాహుల్ చూపించారు. అయితే, అధికార పక్షం రాహుల్ ప్ర‌సంగాన్ని అడ్డుకుంది.

ప‌బ్లిష్ కాని పుస్త‌కంలోని అంశాల‌ను రాహుల్ ప్ర‌స్తావిస్తున్నారంటూ ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మండిప‌డ్డారు. ప్రచురించని పుస్తకాన్ని ఉటంకించడం సభ నియమాలకు విరుద్ధమన్నారు. ర‌క్ష‌ణ మంత్రితోపాటూ హోంమంత్రి అమిత్ షా, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి కిర‌ణ్ రిజుజు కూడా రాహుల్ వ్యాఖ్య‌ల‌ను కొట్టిపారేశారు. ఈ క్ర‌మంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది.

స్పీక‌ర్ ఏమ‌న్నారంటే..

ర‌గ‌డ‌పై లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా స్పందించారు. న్యూస్ పేప‌ర్ క్లిప్పింగ్స్‌, ప‌బ్లిష్ కాని పుస్త‌కాల‌కు సంబంధించిన విష‌యాల‌ను లోక్‌స‌భ‌లో ప్ర‌స్తావించ‌కూడ‌ద‌ని సూచించారు. ఈ మేర‌కు రూల్ బుక్ నియ‌మాల‌ను స‌భ‌లో చ‌దివి వినిపించారు. ఈ నియ‌మాల ప్ర‌కారం.. పబ్లిష్ కాని పుస్త‌కంలోని వివ‌రాల‌ను స‌భ‌లో చ‌ర్చించ‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు.

అయినా రాహుల్ వినిపించుకోలేదు. ఆ పుస్త‌కంలోని వివ‌రాల‌ను ప్ర‌స్తావించేందుకు ప్ర‌య‌త్నించారు. దీనిపై లోక్‌సభలో గందరగోళం నెల‌కొంది. ఫ‌లితంగా రాష్ట్రపతి ప్ర‌సంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగం లేకుండానే తీర్మానించాల్సి వ‌చ్చింది.

స్పీక‌ర్ ఓం బిర్లాకు రాహుల్ లేఖ‌..

మ‌రోవైపు స‌భ‌లో త‌న‌కు మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం లేదంటూ రాహుల్‌.. స్పీక‌ర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇలా చేయ‌డం స‌భ సంప్ర‌దాయాల‌ను ఉల్లింఘించ‌డ‌మే అవుతుంద‌న్నారు. ఇందుకు సంబంధించిన లేఖ‌ను కాంగ్రెస్ ఫార్టీ ఎక్స్‌లో కూడా పోస్టు చేసింది. ఈ మేరకు మోదీ ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించింది.

Advertisement
Advertisement