త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ooty Special Tour Package | చల్లని వాతావరణంలో ఊటీ అందాలను చూసొద్దామా..? మీ కోసమే ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ..!

Ooty Special Tour Package | చలికాలం కొనసాగుతున్నది. ఈ సమయంలో చాలామంది పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకుంటారు. ముఖ్యంగా హిల్‌ స్టేషన్లకు వెళ్తుంటారు. ఓ వైపు చలి.. మరో వైపు పొగమంచులో ప్రకృతి అందాలు పర్యాటకులను మరింత ఆకర్షిస్తుంటాయి.

S

National | Published On Dec 7, 2025, 1.37 pm IST

Ooty Special Tour Package | చల్లని వాతావరణంలో ఊటీ అందాలను చూసొద్దామా..? మీ కోసమే ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ..!
Advertisement

Ooty Special Tour Package | చలికాలం కొనసాగుతున్నది. ఈ సమయంలో చాలామంది పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకుంటారు. ముఖ్యంగా హిల్‌ స్టేషన్లకు వెళ్తుంటారు. ఓ వైపు చలి.. మరో వైపు పొగమంచులో ప్రకృతి అందాలు పర్యాటకులను మరింత ఆకర్షిస్తుంటాయి. శీతాకాలంలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రదేశాల్లో ఊటీ ఒకటి. హిల్స్‌ స్టేషన్‌ క్వీన్‌గా ఊటీ హిల్స్‌ స్టేషన్‌ను పిలుస్తారు. ఈ సమయంలో ఊటికి వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. ‘అల్టీమేట్‌ ఊటీ ఎక్స్‌ హైదరాబాద్‌’ పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో కూనూర్‌ను సైతం వీక్షించొచ్చు. ఆరు రోజులు, ఐదురాత్రుల పాటు ప్యాకేజీలో పర్యటన ఉంటుంది.

జర్నీ ఇలా..

డిసెంబర్‌ 16న శబరి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు ప్రయాణం ఉంటుంది. ఆ రోజంతా రైలు జర్నీ ఉంటుంది. రెండోరోజూ రైలు కోయంబత్తూర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఊటీకి చేరుకొని హోటల్‌లో చెక్‌ ఇన్‌ అవుతారు. సాయంత్రం బొటానికల్‌ గార్డెన్‌, ఊటీ లేక్‌ను సందర్శిస్తారు. రాత్రి ఊటీలోనే బస ఉంటుంది. మరుసటిరోజు ఉదయం దొడబెట్ట పీక్‌, టీ మ్యూజియం, పైకారా వాటర్‌ ఫాల్స్‌ సందర్శనకు వెళ్తారు. మూడోరోజు రాత్రి బస ఊటీలోనే ఉంటుంది. నాలుగో రోజు ఉదయం అల్పాహారం పూర్తి చేసుకొని కూనూర్‌ సైట్‌సీయింగ్‌కు వెళ్తారు. మధ్యాహ్నం వరకు ఊటీకి చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. ఐదో రోజు హోటల్‌ చెక్‌ అవుట్‌ చేసి కోయంబత్తూర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.40 గంటలకు తిరిగి శబరి రైలులో తిరిగి ప్రయాణమవుతారు. ఆరో రోజు ఉదయం 11 గంటలకు రైలు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో ప్రయాణం ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు ఇలా..

ప్యాకేజీలో కంఫ్టర్‌, స్టాండర్డ్‌ కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి. కంఫర్ట్‌ కేటగిరిలో థర్డ్‌ ఏసీలో ప్రయాణం ఉంటుంది. స్టాండర్డ్‌ కేటగిరిలో స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. కంఫ్టర్‌ కేటగిరిలో సింగిల్‌ షేరింగ్‌కు రూ.30వేలు, డబుల్‌ షేరింగ్‌కు డబుల్ షేరింగ్ కోసం రూ.17,070 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.15,850 కాగా.. పిల్లలకు రూ.9700గా ప్యాకేజీ ధర నిర్ణయించింది. ఇక స్టాండర్‌ కేటగిరిలో సింగిల్ షేరింగ్‌కు రూ.27,450, డబుల్‌ షేరింగ్‌ రూ.14,520, ట్రిపుల్ షేరింగ్ రూ.13,300, పిల్లలకు రూ.7,160గా నిర్ణయించింది. ఈ నెల 30న మరో ప్యాకేజీ సైతం అందుబాటులో ఉంది. న్యూ ఇయర్‌ సందర్భంగా గాలా డిన్నర్‌ విత్‌ డీజే మ్యూజిక్‌ ప్యాకేజీ అందుబాటులో ఉంది. దీనికి కంఫర్ట్‌ కేటగిరిలో సింగిల్ షేరింగ్‌ టికెట్‌ రూ.36,930, డబుల్ షేరింగ్‌ రూ.21,770, ట్రిపుల్ షేరింగ్ రూ.19,810, పిల్లలకు రూ.11,250 ధర నిర్ణయించింది. స్టాండర్డ్‌ కేటగిరిలో సింగిల్ షేరింగ్ రూ.34,380, డబుల్ షేరింగ్ రూ.19,220, ట్రిపుల్ షేరింగ్ రూ.17,260, పిల్లలకు రూ.9,010గా నిర్ణయించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement