NEET UG | నీట్ యూజీ.. ఎగ్జామ్ సిటీ, అడ్రస్ మార్చుకునేందుకు ఎన్టీఏ చాన్స్..
NEET UG | నీట్ యూజీ (NEET UG) పరీక్షను జూన్ 21న మళ్లీ నిర్వహించనున్నారు. ఈ నెల 3న జరిగిన పరీక్షను ప్రశ్నపత్రం లీక్ అయిందన్న కారణంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పరీక్షను రీ షెడ్యూల్ (Re-Exam) చేసింది.
NEET UG | త్రినేత్ర.న్యూస్: నీట్ యూజీ (NEET UG) పరీక్షను జూన్ 21న మళ్లీ నిర్వహించనున్నారు. ఈ నెల 3న జరిగిన పరీక్షను ప్రశ్నపత్రం లీక్ అయిందన్న కారణంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పరీక్షను రీ షెడ్యూల్ (Re-Exam) చేసింది. దీంతోపాటు విద్యార్థుల సౌకర్యం కోసం పరీక్ష రాసే నగరాలను (choice of cities), అలాగే ప్రస్తుతం వారు ఉంటున్న అడ్రస్‌ను (modify address) మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. దీనివల్ల విద్యార్థులు తమకు దగ్గరలో ఉన్న పరీక్షా కేంద్రాన్ని ఎంపికచేసుకోవచ్చు.
ఎలా మార్చుకోవాలంటే..
అభ్యర్థులు తమ పరీక్షా నగరాన్ని మార్చుకోవడానికి మే 21న రాత్రి 11.50 గంటల వరకు ఎన్టీఏ అవకాశం కల్పించింది. విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లోకి వెళ్లి తమ లాగిన్ వివరాలతో ఈ మార్పులు చేసుకోవచ్చు. మొదటి, రెండో ప్రాధాన్యతగా ఏయే నగరాల్లో పరీక్ష రాయాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు. ఎలాంటి మార్పులు చేయనట్లయితే పాత అప్లికేషన్‌లో ఉన్న సెంటర్‌నే ఎన్‌టీఏ మళ్లీ కేటాయిస్తుంది.
కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా?
రీఎగ్జామ్‌కోసం అభ్యర్థులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదనపు పరీక్షా రుసుము కూడా చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. పాత రిజిస్ట్రేషన్ డేటా, పరీక్షా కేంద్రాలనే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అంతేకాదు, ఇప్పటికే చెల్లించిన ఫీజును కూడా విద్యార్థులకు రీఫండ్ చేయనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. పరీక్ష జూన్ 21న ఆదివారం మధ్యాహ్నం మునుపటిలానే పెన్, పేపర్ విధానంలో జరుగనుంది. దీంతో మే 3న నిర్వహించిన నీట్ పరీక్షలో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. రీ ఎగ్జామ్‌లోనూ అంతే మంది హాజరయ్యే అవకాశం ఉంది.
పేపర్ లీక్..
పరీక్షకు ముందు రాజస్థాన్ (Rajasthan)లో పంపిణీ చేసిన మెటీరియల్‌తో పరీక్ష పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు (నీట్ పరీక్షలోని మొత్తం 720 మార్కులకు గాను) పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మే 3న జరిగిన పరీక్షలో వచ్చిన ప్రశ్నల్లో సుమారు 140 ప్రశ్నలు.. పరీక్షకు ముందే లభ్యమైన ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ బ్యాంక్‌లోని ప్రశ్నలతో పోలిఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ గెస్ పేపర్ పరీక్షకు రెండు రోజుల ముందే అంటే మే1వ తేదీనే రాజస్థాన్‌లోని సికార్‌లో అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడైంది. ఈ ప్రశ్నపత్రాన్ని రూ.20 వేల నుంచి రూ.2లక్షలకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతేకాదు పరీక్షకు ముందు పంపిణీ అయిన మెటీరియల్‌లో ఉన్న ప్రశ్నలే కాకుండా.. వాటిలోని సమాధానాల ఆప్షన్ల వరుస క్రమం కూడా అసలు ప్రశ్నపత్రంతో సరిపోలడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా, లేదా ఎవరైనా పేపర్ లీక్ చేశారా..? అనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఇప్పుడు రీఎగ్జామ్ షెడ్యూల్‌ను ప్రకటించింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






