త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prajavani | మండ‌ల ప్ర‌జావాణి కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి : జీ చిన్నారెడ్డి

Prajavani | రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి తొలిసారిగా ప్రారంభం కానున్న మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అవసరాన్ని బట్టి రైతు వేదికలను వినియోగించుకోవాలని రాష్ట్ర స్థాయి ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ డాక్టర్ జీ చిన్నారెడ్డి సూచించారు. ఈ మేరకు అన్ని మండలాల ఎంపీడీవోలకు ప్రకటన విడుదల చేశారు. ప

P

Telangana | Published On Aug 16, 2026, 8.51 pm IST

Prajavani | మండ‌ల ప్ర‌జావాణి కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి : జీ చిన్నారెడ్డి
Advertisement

Prajavani | రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి తొలిసారిగా ప్రారంభం కానున్న మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అవసరాన్ని బట్టి రైతు వేదికలను వినియోగించుకోవాలని రాష్ట్ర స్థాయి ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ డాక్టర్ జీ చిన్నారెడ్డి సూచించారు. ఈ మేరకు అన్ని మండలాల ఎంపీడీవోలకు ప్రకటన విడుదల చేశారు. పలు మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహణకు సరిపడా వసతి లేదని తమ దృష్టికి వచ్చిందని చిన్నారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి రైతు వేదికల్లో ప్రజావాణి నిర్వహణకు అనుమతి కోరగా ఆయన అంగీకరించారని చెప్పారు. అవసరమైన చోట రైతు వేదికలను ఉపయోగించుకుని మండల ప్రజావాణిని విజయవంతంగా నిర్వహించాలని ఎంపీడీవోలకు సూచించారు. ఇటీవల ప్రజాభవన్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఇచ్చిన సూచనలను పాటిస్తూ దరఖాస్తుదారులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించి, వారి సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని చిన్నారెడ్డి సూచించారు. మండల స్థాయిలో ప్రజలకు ప్రజావాణి మరింత చేరువయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement