Noida Airport | నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో జూన్ 15 నుంచి విమానాల రాకపోకలు.. ప్రకటించిన అధికారులు..!
Noida Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ఈ ఏడాది జూన్ 15 నుంచి మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. తొలి వాణిజ్య విమానాన్ని ఇండిగో సంస్థ నడిపించనుంది.
Noida Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ఈ ఏడాది జూన్ 15 నుంచి మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. తొలి వాణిజ్య విమానాన్ని ఇండిగో సంస్థ నడిపించనుంది. అనంతరం అకాసా ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు సేవలను మొదలుపెట్టనున్నాయి. విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఇప్పటికే సుమారు 70 విమానాల ప్రతిపాదనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA) సీఈఓ, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (NIAL) అధికారి రాకేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ వాణిజ్య సర్వీసులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
దేశంలోని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి విమానాలు నడపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రారంభ దశలో సుమారు 17 విమానాలను నడపాలని ఎయిర్‌లైన్స్ ప్రతిపాదించాయి. అనుమతులు లభించిన వెంటనే టికెట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. ఈ విమానాశ్రయాన్ని మార్చి 28న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో దేశీయ, కార్గో టెర్మినల్స్ నిర్మాణం పూర్తయ్యింది. 3900 మీటర్ల పొడవైన రన్‌వే, ప్రయాణికుల టర్మినల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC), కార్గో హబ్ ఉన్నాయి. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారనుంది. ప్రతి ప్రయాణికుడిపై సుమారు రూ.496 ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా.
వచ్చే 30 ఏళ్లలో మొత్తం ఆదాయం రూ.1 లక్ష కోట్లు చేరవచ్చని అధికారులు భావిస్తున్నారు. విమానాశ్రయం ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో భూముల డిమాండ్ వేగంగా పెరిగింది. ఆర్‌కే సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యమునా సిటీ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. భూములు కొనుగోలు చేసి వినియోగించని యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో అనూహ్యంగా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో ఈ విమానాశ్రయం భవిష్యత్తులో ఆదాయ కేంద్రంగా నిలుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
జులై 27, 2026

DGCA on Air Fare | దేశీయ విమాన ఛార్జీలకు రెక్కలు.. 72 మార్గాల్లో ఏడాదిలో 20.5 శాతం పెరుగుదల..
జులై 27, 2026

TPCC | తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత పనితీరుపై కేసీ వేణుగోపాల్ సమీక్ష
జులై 27, 2026
తాజావార్తలు
- ●Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!
- ●AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!
- ●Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!
- ●Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
- ●KTR Delhi visit | ఢిల్లీలో కేటీఆర్.. తెలంగాణ బిడ్డ సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి

Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?

TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!

Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!



