త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zoho WFH Policy | ప్రధాని మోదీ చెప్పినా సరే.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదన్న జోహో సీఈవో శ్రీధర్ వెంబు

ప్రధాని మోదీ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సూచించినా, జోహో (Zoho) మాత్రం ఆఫీస్ నుంచే పనిచేయాలని స్పష్టం చేసింది. ఆ కంపెనీ సీఈవో శ్రీధర్ వెంబు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణమేంటి?

J

National | Published On May 19, 2026, 3.39 pm IST

Zoho WFH Policy | ప్రధాని మోదీ చెప్పినా సరే.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదన్న జోహో సీఈవో శ్రీధర్ వెంబు
Advertisement

Zoho WFH Policy | త్రినేత్ర.న్యూస్ : ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) తీసుకురావాలన్న చర్చ జరుగుతున్న వేళ.. ప్రముఖ టెక్ కంపెనీ జోహో (Zoho) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు రిమోట్ వర్క్ ఆప్షన్లను పెంచే ఆలోచన ఏమాత్రం లేదని కంపెనీ ఫౌండర్, సీఈఓ శ్రీధర్ వేంబు (Sridhar Vembu) స్పష్టం చేశారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇంధన ఆదా కోసం ఆన్‌లైన్ మీటింగ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి కోవిడ్ నాటి అలవాట్లను మళ్లీ మొదలుపెట్టాలని సూచించారు. కానీ, ఆఫీస్‌లో ముఖాముఖిగా కలిసి పనిచేస్తేనే (Face-to-face collaboration) మంచి రిజల్ట్స్ వస్తాయని శ్రీధర్ వెంబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) టీమ్స్ ఆఫీస్ నుంచి పనిచేయడమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆఫీస్‌కి వస్తేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి

తాజాగా ఎక్స్ వేదికగా శ్రీధర్ వెంబు ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. వర్క్ కల్చర్‌పై గతంలో తను చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో, కంపెనీలో దీనిపై లోతైన చర్చ జరిగిందన్నారు. "నా ఎక్స్ పోస్ట్‌పై మా కంపెనీలో చాలా చర్చ జరిగింది. ఫైనల్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విస్తరించకూడదని నిర్ణయించాం. R&D విభాగంలో ముఖాముఖిగా సమస్యలను పరిష్కరించుకున్నప్పుడే ప్రొడక్టివిటీ (Productivity) ఎక్కువగా ఉంటుంది" అని ఆయన చెప్పుకొచ్చారు.

తన సొంత డెవలప్‌మెంట్ టీమ్‌లో ఎదురైన అనుభవాలను ఆయన పంచుకుంటూ.. టీమ్ మెంబర్స్ ఒకే దగ్గర ఉంటే ఐడియాలు బాగా వస్తాయని, సమస్యలను త్వరగా సాల్వ్ చేయవచ్చని చెప్పారు. రిమోట్ వర్క్ (Remote work) చేయడం వల్ల ఇష్యూస్ క్లియర్ అవ్వడానికి చాలా సమయం పడుతోందని ఆయన తెలిపారు.

ప్రధాని మోదీ ఏమన్నారంటే..

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం, ప్రపంచవ్యాప్త అనిశ్చితి కారణంగా పెట్రోల్, డీజిల్ దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలని మోదీ దేశ ప్రజలకు సూచించారు. "మనం మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగ్స్, ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి" అని ఆయన అన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, కార్ పూలింగ్ వాడాలని, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జోహో ఫోకస్: రిమోట్ వర్క్ కాదు.. సస్టైనబిలిటీ

వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనప్పటికీ.. ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి జోహో ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. తమ ఉద్యోగుల ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ బస్సులను (Electric buses), క్యాంటీన్లలో ఎలక్ట్రిక్ కుకింగ్ సిస్టమ్స్‌ను వాడే ఆలోచనలో ఉన్నట్లు వెంబు తెలిపారు. సోలార్ ఎనర్జీలో తమ కంపెనీ ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తుచేశారు.

ఏఐ (AI) యుగంలో మన భవిష్యత్తు ఏంటి?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కేర్ గివింగ్ (Caregiving), టీచింగ్, వ్యవసాయం వంటి రంగాలు మాత్రమే ఏఐకి అతీతంగా ఉంటాయని, కేవలం ఆర్థిక లాభం కోసం కాకుండా ఒక పర్పస్ తో చేసే పనులకే భవిష్యత్తు ఉంటుందని ఆయన విశ్లేషించారు. ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయా లేదా పనిచేసే విధానం మారుతుందా అనే గ్లోబల్ డిబేట్ నడుస్తున్న వేళ.. వెంబు చేసిన ఈ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement
Advertisement