త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | తీర ప్రాంతాల్లో కొబ్బ‌రి, గంధం చెట్లు : నిర్మ‌లా సీతారామ‌న్‌

Union Budget 2026 | దేశంలోని వ్య‌వ‌సాయ రంగాన్ని కొత్త పుంత‌లు తొక్కించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. కేంద్ర బ‌డ్జెట్ 2026 ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా నిర్మ‌లా సీతారామ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

S

National | Published On Feb 1, 2026, 12.03 pm IST

Union Budget 2026 | తీర ప్రాంతాల్లో కొబ్బ‌రి, గంధం చెట్లు : నిర్మ‌లా సీతారామ‌న్‌
Advertisement

Union Budget 2026 | త్రినేత్ర‌.న్యూస్ : దేశంలోని వ్య‌వ‌సాయ రంగాన్ని కొత్త పుంత‌లు తొక్కించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. కేంద్ర బ‌డ్జెట్ 2026 ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా నిర్మ‌లా సీతారామ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్న‌ట్టు ఆమె తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. 500 రిజర్వాయర్లలో చేపల పెంపకం, అభివృద్ధికి చర్యలు తీసుకుంటామ‌న్నారు. పశు సంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సాహకాలు క‌ల్పిస్తామ‌న్నారు. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం క‌ల్పిస్తామ‌న్నారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల నాటకానికి ప్రోత్సాహం.. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం.. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్ల నాటకానికి ప్రోత్సాహకాలు. కొండ ప్రాంతాల్లో వాల్ న‌ట్స్, బాదం, పైన్ న‌ట్స్ కూడా పెంచుతాం అని నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement