త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NHAI | ఇక టోల్ బూత్‌ల‌లో మ‌హిళ‌లు.. ఎన్‌హెచ్ఏఐ కీల‌క నిర్ణ‌యం

NHAI | దేశ‌వ్యాప్తంగా ర‌హ‌దారుల‌పై ఉన్న టోల్ బూత్‌ల‌లో పెద్ద ఎత్తున మ‌హిళ‌ల‌ను చేర్చుకోనున్న‌ట్లు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) ప్ర‌క‌టించింది.

S

National | Published On Mar 14, 2026, 6.18 pm IST

NHAI | ఇక టోల్ బూత్‌ల‌లో మ‌హిళ‌లు.. ఎన్‌హెచ్ఏఐ కీల‌క నిర్ణ‌యం
Advertisement

NHAI | త్రినేత్ర‌.న్యూస్ : దేశ‌వ్యాప్తంగా ర‌హ‌దారుల‌పై ఉన్న టోల్ బూత్‌ల‌లో పెద్ద ఎత్తున మ‌హిళ‌ల‌ను చేర్చుకోనున్న‌ట్లు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ప్ర‌క‌టించింది. మొత్తం 1,140కి పైగా ఉన్న టోల్ ప్లాజాల‌లో 5,100 మంది మ‌హిళ‌ల‌ను నియ‌మించుకుని ప‌గ‌టిపూట షిఫ్టుల్లో ప‌నిచేయించ‌నున్న‌ట్లు తెలిపింది. ఎన్‌హెచ్ఏఐ నిర్ణ‌యంతో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు చెందిన మ‌హిళ‌ల‌కు నూత‌న ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. సాధార‌ణంగా టోల్‌ప్లాజాల వ‌ద్ద సిబ్బందికి, ప్ర‌యాణికుల‌కు మ‌ధ్య జ‌రిగే వాగ్వాదాల‌ను త‌గ్గించేందుకు ఈ నిర్ణ‌యం దోహ‌ద‌ప‌డ‌నుంది. విధులు నిర్వ‌హించే మ‌హిళా సిబ్బందికి ముందుగానే ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

Advertisement
Advertisement