త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PMO | ప్ర‌ధాని ఆఫీస్ అడ్ర‌స్ మారింది..! సౌత్ బ్లాక్ నుంచి సేవా తీర్థ్‌లోకి..!

PMO | ప్ర‌ధాన న‌రేంద్ర మోదీ అధికారిక కార్యాల‌యం అడ్ర‌స్ మారింది. ద‌శాబ్దాల నుంచి కొన‌సాగుతున్న సౌత్ బ్లాక్ నుంచి కొత్త కార్యాల‌యం సేవా తీర్థ్‌లోకి మారారు. శుక్ర‌వారం సీవాతీర్థ్‌ని ప్రారంభించి, బాధ్య‌త‌లు స్వీక‌రించారు. పీఎంఓతో పాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్‌ సెక్రెటేరియట్ కార్యాల‌యాలు సైతం సేవా తీర్థ్‌లోనే ఉంటాయి.

P

National | Published On Feb 13, 2026, 6.24 pm IST

PMO | ప్ర‌ధాని ఆఫీస్ అడ్ర‌స్ మారింది..! సౌత్ బ్లాక్ నుంచి సేవా తీర్థ్‌లోకి..!
Advertisement

PMO | ప్ర‌ధాన న‌రేంద్ర మోదీ అధికారిక కార్యాల‌యం అడ్ర‌స్ మారింది. ద‌శాబ్దాల నుంచి కొన‌సాగుతున్న సౌత్ బ్లాక్ నుంచి కొత్త కార్యాల‌యం సేవా తీర్థ్‌లోకి మారారు. శుక్ర‌వారం సీవాతీర్థ్‌ని ప్రారంభించి, బాధ్య‌త‌లు స్వీక‌రించారు. పీఎంఓతో పాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్‌ సెక్రెటేరియట్ కార్యాల‌యాలు సైతం సేవా తీర్థ్‌లోనే ఉంటాయి. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్‌లో ప్రధాని కార్యాలయంలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. కార్యాలయం పాతబడడం, మారుతున్న కాలానికి అనుగుణంగా లేకపోవడంతో కొత్త కార్యాల‌యాన్ని నిర్మించారు. కార్యాల‌యం ప్రారంభానికి ముందు భ‌వ‌నంలో గ‌ణప‌తిపూజ‌లో పాల్గొన్నారు. అనంత‌రం మహిళా, యువత, రైతులకు సంబంధించిన ఫైళ్లపై మోదీ సంతకాలు చేశారు. ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డ్డ బాధితుల‌కు రూ.1.50ల‌క్ష‌ల వ‌ర‌కు నగదు రహిత చికిత్స పథకానికి ఆయ‌న ఆమోదం తెలిపారు. లఖ్‌పతి దీదీ పథకం లబ్ధిదారుల సంఖ్య ఆరు కోట్లకు పెంచారు.

అగ్రికల్చర్ మౌలిక సదుపాయాల నిధి రూ.2లక్షల కోట్లకు పెంపు త‌దిత‌ర ద‌స్త్రాల‌పై మోదీ సంత‌కాలు చేశారు. ఈ సంద‌ర్భంగా రూ.100 ప్రత్యేక నాణేన్ని మోదీ విడుదల చేశారు. కార్య‌క్ర‌మంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సహాయ మంత్రి జితేంద్ర సింగ్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా.. కర్తవ్య భవన్‌లో ఆర్థిక, రక్షణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్పొరేట్ వ్యవహారాలు, విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖ, ఐఅండ్‌బీ శాఖ, వ్యవసాయం, రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖ సహా పలు కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేలా అధునాతన సౌకర్యాలతో నూతన కార్యాలయాల‌ను నిర్మించారు. ఈ భవన సముదాయంలో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్, నిఘా నెట్‌వ‌ర్క్‌, ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ ఫెసిలిటీలు, ఇత‌ర భ‌ద్ర‌తా సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement