త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET UG 2026 | నీట్ యూజీ 2026 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మే 3న ప‌రీక్ష‌..!

NEET UG 2026 | నీట్ యూజీ 2026 నోటిఫికేష‌న్‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఆదివారం విడుద‌ల చేసింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి మార్చి 8వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు.

S

National | Published On Feb 8, 2026, 6.50 pm IST

NEET UG 2026 | నీట్ యూజీ 2026 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మే 3న ప‌రీక్ష‌..!
Advertisement

NEET UG 2026 | త్రినేత్ర‌.న్యూస్ : నీట్ యూజీ 2026 నోటిఫికేష‌న్‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఆదివారం విడుద‌ల చేసింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి మార్చి 8వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు. మార్చి 10 నుంచి 12వ తేదీ మ‌ధ్య‌లో త‌ప్పుల స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు ఎంతంటే..?

ఓపెన్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు రూ. 1700, జ‌న‌ర‌ల్ ఈడ‌బ్ల్యూఎస్‌/ ఓబీసీ - ఎన్సీఎల్ అభ్య‌ర్థుల‌కు రూ. 1600, ఎస్సీ, ఎస్టీ, డిజ‌బుల్డ్ అభ్య‌ర్థుల‌కు రూ. 1000గా నిర్ధారించారు. ఇండియా వెలుప‌ల ఎగ్జామ్ రాయాల‌నుకునే అభ్య‌ర్థులు రూ. 9500 చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ప‌రీక్ష ఎప్పుడంటే..?

నీట్ యూజీ 2026 రాత‌ప‌రీక్ష‌ను మే 3వ తేదీన మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. అడ్మిట్ కార్డులను ఎప్ప‌ట్నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెబ్‌సైట్‌లో పొందుప‌రుస్తామ‌ని పేర్కొన్నారు. ఇక ద‌ర‌ఖాస్తు, అర్హ‌త‌తో పాటు త‌దిత‌ర వివ‌రాల కోసం ఎన్టీఏ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాల‌ని అధికారులు సూచించారు.

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మెడిక‌ల్ కాలేజీల్లో బీడీఎస్, బీవీఎస్సీ, ఏహెచ్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం నీట్ యూజీ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement
Advertisement