Telugu Serial Actor | రెండో పెళ్లి చేసుకున్న మొగలి రేకులు సీరియల్ నటి – ఇన్‌స్టా పోస్ట్‌తో భర్తను పరిచయం చేసిన శిరీష!
మొగలి రేకులు సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది శిరీష. ఈ సూపర్ హిట్ సీరియల్‌తోనే శిరీష నట ప్రయాణం ప్రారంభమైంది. తాజాగా బుల్లితెర నటి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భర్తను ఫ్యాన్స్‌కు పరిచయం చేసింది.
Naresh N
Entertainment | Published On Aug 28, 2026, 6.37 pm IST

శిరీష పెళ్లి ఆర్‌జే, నటుడు మహేంద్రతో శుక్రవారం జరిగింది. సిరి వెడ్స్ మహీ అని బోర్డ్‌తో కూడిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో శిరీష పోస్ట్ చేసింది.

శిరీషకు ఇది రెండో వివాహం. నవీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న శిరీష 2024లో అతడికి విడాకులు ఇచ్చింది.

మహేంద్ర కూడా నటుడే. ఆర్జేగా కెరీర్ మొదలుపెట్టిన అతడు ఇంటింటి రామాయణం, మగువ ఓ మగువతో పాటు మరికొన్ని సీరియల్స్‌లో కనిపించాడు.

శిరీష స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా. మొగిలి రేకులు తర్వాత రాములమ్మ, స్వాతిచినుకులు, చెల్లెలి కాపురం, ఎవరే నువ్వు మోహినితో పాటు మరికొన్ని సీరియల్స్ చేసింది.

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న బొమ్మరిల్లు సీరియల్‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో శిరీష నటిస్తోంది.

శిరీషకు సౌజన్య, రజిత అనే సిస్టర్స్ ఉన్నారు. వీరిద్దరు పలు తెలుగు సీరియల్స్‌లో నటించారు. సౌజన్య కార్తీక దీపంతో ఫేమస్ అయ్యింది.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్


