త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sharad Pawar | ఆసుప‌త్రిలో చేరిన శ‌ర‌ద్ ప‌వార్‌.. ఆందోళ‌న‌లో కార్య‌క‌ర్త‌లు

Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 85 ఏళ్లు.

D

National | Published On Feb 9, 2026, 4.02 pm IST

Sharad Pawar | ఆసుప‌త్రిలో చేరిన శ‌ర‌ద్ ప‌వార్‌.. ఆందోళ‌న‌లో కార్య‌క‌ర్త‌లు
Advertisement

Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 85 ఏళ్లు. తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం ఉద‌యం పూణె (Pune)లోని రూబీ హాల్ క్లినిక్‌లో చేరారు (Sharad Pawar Hospitalised). ఆయ‌న‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

శ‌ర‌ద్ ప‌వార్ గొంతు ఇన్ఫెక్ష‌న్‌, ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న‌ట్లు ప‌వ‌ర్ కార్యాల‌యం తెలిపింది. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది త‌లెత్త‌డంతో ప‌వార్‌ను కుటుంబ స‌భ్యులు బారామ‌తి (Baramati)లోని నివాసం నుంచి పూణె ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు పేర్కొంది. చీఫ్ కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ ప‌ర్వేజ్ గ్రాంట్ బృందం శ‌ర‌ద్ ప‌వార్‌కు చికిత్స అందిస్తోంది. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తోంది.

క్యాన్స‌ర్ పేషెంట్‌..

శ‌ర‌ద్ ప‌వార్ క్యాన్స‌ర్ పేషెంట్‌. త్రోట్‌ క్యాన్స‌ర్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఇప్పుడు గొంతు ఇన్ఫెక్ష‌న్ కావ‌డంతో కుటుంబ స‌భ్యులు ముందు జాగ్ర‌త్త‌గా ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయ‌న‌కు అన్ని ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు ప‌వార్ కార్యాల‌యం తెలిపింది. మ‌రోవైపు ఈ విష‌యం తెలుసుకున్న కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

రెండు నెల‌లుగా అనారోగ్యంతోనే

కాగా, శ‌ర‌ద్ ప‌వార్ గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. అనారోగ్యం కారణంగా ఆయన గత రెండు, మూడు నెలలుగా అన్ని బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న‌ట్లు తెలిసింది.

రాజకీయ జీవితం

శ‌ర‌ద్ ప‌వార్.. 1956లో గోవా స్వాతంత్య్ర ఉద్యమంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1958లో కాంగ్రెస్ పార్టీ కి ప్రాధాన్యత ఇచ్చి యూత్ కాంగ్రెస్‌లో చేరారు. 1962లో పూనా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు. 1967లో బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1969లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1970లో తొలిసారి అప్ప‌టి ముఖ్య‌మంత్రి వ‌సంత‌రావు నాయ‌క్ మంత్రివ‌ర్గంలో రాష్ట్ర హోం మంత్రిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత 1975-77 శంక‌ర‌రావు చ‌వాన్ ప్ర‌భుత్వంలోనూ హోం వ్య‌వ‌హారాల మంత్రిగానే కొన‌సాగారు. అయితే, 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జనతా కూటమి అధికారాన్ని కోల్పోయింది. ఆ త‌ర్వాత‌ 1978లో అతి పిన్న వయస్సులో (38 ఏళ్ల వయస్సులో) శ‌ర‌ద్ ప‌వార్ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. శ‌ర‌ద్ ప‌వార్ కేంద్ర రక్షణ, వ్యవసాయ శాఖ మంత్రిగానూ పనిచేశారు. 1999లో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని స్థాపించారు. ఆ త‌ర్వాత ఎన్సీపీ రెండుగా చీలిపోయింది.

Advertisement
Advertisement