Amit Shah | మార్చి 31కల్లా దేశంలో నక్సలిజం అంతం : అమిత్ షా
Amit Shah | దేశంలో 2026 మార్చి 31లోపు నక్సలిజాన్ని (Naxalism) పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి (Home Minister) అమిత్ షా (Amit Shah) మరోసారి స్పష్టం చేశారు.
Amit Shah | దేశంలో 2026 మార్చి 31లోపు నక్సలిజాన్ని (Naxalism) పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి (Home Minister) అమిత్ షా (Amit Shah) మరోసారి స్పష్టం చేశారు. అస్సాంలోని గౌహతిలో శనివారం నిర్వహించిన 87వ సీఆర్పీఎఫ్ (Central Reserve Police Force) డే పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ దళం ముఖ్య పాత్ర పోషించిందన్నారు. ఇక్కడ రాళ్ల దాడి ఘటనలు సంఖ్య సున్నాకి పడిపోయిందన్నారు. మణిపూర్‌లోనూ వర్గ హింసను ఆ దళాలు కట్టడి చేసినట్లు చెప్పారు. కేవలం మూడేళ్లలో మావోల వెన్ను విరగొట్టినట్లు తెలిపారు. "నేను సీఆర్పీఎఫ్‌పై నమ్మకంతో చెబుతున్నాను. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సల్ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తాం" అని షా అన్నారు.
"2025 ఏప్రిల్-మే నెలల్లో ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో నిర్వహించిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో 31 మంది మావోయిస్టులు మరణించారు. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను సైతం లెక్కచేయకుండా.. సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ దళాలు ధైర్య సాహసాలను ప్రదర్శించారు. మండే రాళ్లను ధైర్యంగా ఎదుర్కొని మావోల పట్టు నుంచి ఆ పర్వతాలకు విముక్తలి కల్పించారు. 11 ఏళ్ల క్రితం దేశంలో మూడు పెద్ద హాట్‌స్పాట్‌లు ఉండేవి. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం, ఈశాన్యంలో చొరబాటులు, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నక్సలిజం పెద్ద సమస్యగా ఉండేవి. ఇప్పుడు అవి శాంతి, ప్రగతికి కేంద్రాలుగా మారాయి. ఒకప్పుడు బాంబు దాడులు, బుల్లెట్‌లు, దిగ్బంధనాలు, విధ్వంసాలకు కేంద్రంగా ఉన్న ఈ మూడు ప్రాంతాలు నేడు దేశ అభివృద్ధిలో భాగమయ్యాయి. సీఆర్పీఎఫ్ సహకారం లేనిదే ఇది సాధ్యం కాదు" అని అమిత్ షా వెల్లడించారు. అదేసమయంలో ఈశాన్యంలో 700 మంది, నక్సల్ ప్రాంతంలో 780 మంది, జమ్ము ప్రాంతంలో 540 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించినట్లు గుర్తు చేశారు. వీరి త్యాగాల వల్లే ఆ ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధికి నోచుకుంటున్నాయని షా పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

BJP | రాహుల్ రిమోట్ కంట్రోల్ పాకిస్థాన్‌లో ఉంది : బీజేపీ
మే 20, 2026

Amit Shah Felicitates Telangana Police | తెలంగాణ పోలీసులకు అరుదైన గౌరవం: ‘నక్సల్స్ ఫ్రీ’ ఆపరేషన్‌పై అమిత్ షా ప్రశంసల జల్లు
మే 18, 2026

Jihadi Drug | రూ.182 కోట్ల విలువైన జిహాదీ డ్రగ్స్ పట్టివేత.. అమిత్ షా కీలక ప్రకటన
మే 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



