Nari Shakti Vandan Adhiniyam | కొత్త మహిళా రిజర్వేషన్లతోనే 2029 ఎన్నికలు
Nari Shakti Vandan Adhiniyam | 2029లో జరిగే పార్లమెంటు, శాసనసభల ఎన్నికల నుంచే కొత్త మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పార్లమెంట్ సభ్యుడిపై ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ చరిత్రాత్మక బిల్లుకు సంబంధించి ఈ నెల 16న పార్లమెంటులో చర్చ ఉంటుందని తెలిపారు.
16న పార్లమెంటులో ప్రత్యేక చర్చ
మీ అభిప్రాయాలు తెలియజేయండి
అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోదీ లేఖ
29 తర్వాత చర్చ పెట్టండి
డీ లిమిటేషన్ ఎలా చేస్తారో చెప్పరా..?
మోదీకి లేఖ రాసిన మల్లికార్జున ఖర్గే
Nari Shakti Vandan Adhiniyam | త్రినేత్ర.న్యూస్ : 2029లో జరిగే పార్లమెంటు, శాసనసభల ఎన్నికల నుంచే కొత్త మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పార్లమెంట్ సభ్యుడిపై ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ చరిత్రాత్మక బిల్లుకు సంబంధించి ఈ నెల 16న పార్లమెంటులో చర్చ ఉంటుందని తెలిపారు. మహిళా బిల్లుకు పార్టీలకు అతీతంగా లోక్ సభ లేదా రాజ్యసభలోని ప్రతి ఒక్క సభ్యుడు సమ్మతి తెలపాలంటూ ఆయన అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆదివారం లేఖ రాశారు. నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లు ఇక తుది దిశకు చేరుకున్నది. ఇక బిల్లు ఆమోదమే తరువాయి. భారతదేశపు అభివృద్ధిలో ఇదొక కీలక ఘట్టం. అభివృద్ధి చెందిన దేశంగా మనం ముందుకు సాగాలంటే మహిళలకు ప్రాధాన్యత తప్పనిసరి.. అని ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.
2023లో ఆమోదం పొందినా..
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లును 2027 జనాభా లెక్కలతో సంబంధం లేకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం ఏప్రిల్ 2026లో ముసాయిదా సవరణకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం మహిళా కోటా కోసం ప్రత్యేకంగా నియోజకవర్గాలను డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా గుర్తిస్తారు. 2029 నుంచి జరిగే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు.
డీలిమిటేషన్ ఎలా చేస్తారో చెప్పరా..?
ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ప్రధానికి లేఖ రాశారు. డీ లిమిటేషన్ ఎలా చేస్తారో ఆ బిల్లు వివరాలేవీ తెలపకుండానే ప్రతిపక్ష పార్టీలను మద్దతు కోరడం హాస్యాస్పదం అన్నారు. పైగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఏప్రిల్ 29 వరకు జరుగుతున్నాయని ఆ తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం మంచిదని సూచించారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే 16న చర్చకు ముహూర్తం ఖరారు చేశారని ఖర్గే ఆ లేఖలో విమర్శించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






