Massive Traffic jam | ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ట్రాఫిక్ జామ్.. 32 గంటల తర్వాత కదిలిన వాహనాలు
Massive Traffic jam | దేశంలో అత్యంత రద్దీ రహదారుల్లో ఒకటైన ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే (Mumbai-Pune Expressway)పై భారీగా ట్రాఫిక్ జామ్ (Massive Traffic jam) ఏర్పడిన విషయం తెలిసిందే.
Massive Traffic jam | దేశంలో అత్యంత రద్దీ రహదారుల్లో ఒకటైన ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే (Mumbai-Pune Expressway)పై భారీగా ట్రాఫిక్ జామ్ (Massive Traffic jam) ఏర్పడిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్ర ఓ గ్యాస్ ట్యాంకర్ (gas tanker) బోల్తా పడటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అప్పటి నుంచి దాదాపు రెండు రోజుల పాటూ వాహనాలు ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయాయి. ఎట్టకేలకు 32 గంటల తర్వాత వాహనాలు ఇప్పుడు కదులుతున్నాయి.
రెండు రోజులుగా..
మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాయ్‌ఘడ్ జిల్లాలోని అదోషి టన్నెల్ వద్ద ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై ఓ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆ ట్యాంకర్ నుంచి భారీగా గ్యాస్ లీకైంది. అప్రమత్తమైన అధికారులు ఎక్స్‌ప్రెస్ వేపై వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో దాదాపు 20 నుంచి 22 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది. రెండు రోజులుగా తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక అల్లాడిపోయారు. వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేక ఇబ్బందులు పడ్డారు. ఇక చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్న వారి ఇబ్బందులు చెప్పనక్కర్లేదు.
గ్యాస్ ట్యాంకర్‌ను తొలగించి..
రంగంలోకి దిగిన ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొన్ని గంటల పాటూ శ్రమించి గురువారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్‌ను క్రేన్ సాయంతో అక్కడి నుంచి తొలగించారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రస్తుతం వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ పూర్తిగా క్లియర్ కావడానికి మరికొన్ని గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
రోడ్డుపై వంట.. వాహనాల్లోనే నిద్ర..
వాహనదారులు ఈ రెండు రోజులూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లారీ డ్రైవర్లతే రోడ్డుపైనే వంట చేసుకుని కడుపు నింపుకున్నారు. వాహనాల్లోనే విశ్రాంతి తీసుకున్నారు. ఇవాళ ఉదయం ట్రాఫిక్ పోలీసులు ప్రతి వాహనం వద్దకూ వెళ్లి డ్రైవర్లను నిద్రలేపుతూ.. ట్రాఫిక్ ముందుకు సాగేలా చర్యలు చేపట్టారు. ఈ భారీ ట్రాఫిక్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
https://x.com/VarshaEGaikwad/status/2019042372093636864
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






