Raghav Chadha | పన్నులు, విమానాశ్రయ ఆహారం, రైట్ టు రీకాల్‌పై రాఘవ్ చద్దా ప్రశ్నలు.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం
Raghav Chadha | రాజ్యసభలో ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ (Raghav Chadha) కీలకమైన అంశాలను ప్రస్తావించారు. అవి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా సాధారణ ప్రజలపై పన్నుల భారం, విమానాశ్రయాల్లో ఆహార ధరల పెరుగుదల, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనంపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు చర్చకు దారితీశాయి.
Raghav Chadha | రాజ్యసభలో ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ (Raghav Chadha) కీలకమైన అంశాలను ప్రస్తావించారు. అవి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా సాధారణ ప్రజలపై పన్నుల భారం, విమానాశ్రయాల్లో ఆహార ధరల పెరుగుదల, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనంపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు చర్చకు దారితీశాయి. ఆయన ప్రస్తావించిన అంశాలపై బుధవారం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
పన్నులపై ప్రశ్నలు..
బడ్జెట్ సమావేశాల సమయంలో రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలు వేసారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉన్న అనుభవంతో బడ్జెట్ లోపాలను స్పష్టం చేసిన ఆయన, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారిక సమాధానాలు కోరారు. ముఖ్యంగా పన్నుల భారాన్ని, మధ్యతరగతి ప్రజల పరిస్థితిని ఆయన నిలదీశారు. దేశంలో పన్నుల వసూళ్లు రికార్డు స్థాయికి చేరుతున్నప్పటికీ, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం ఎందుకు లభించడం లేదని ఆయన ప్రశ్నించారు. జీతాలు పెద్దగా పెరగకపోయినా ద్రవ్యోల్బణం సుమారు 6.8%కు చేరడంతో కొనుగోలు శక్తి తగ్గుతోందని ఆయన సూచించారు. దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) తొలగించాలనీ డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పెట్టుబడులు అవసరమని, పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నామని వెల్లడించింది. అయితే, ఆదాయపు పన్ను తగ్గింపు విషయంలో ఏ హామీ ఇవ్వలేదు.
రైట్ టు రీకాల్
రాజ్యసభలో ఆయన ప్రస్తావించిన “రైట్ టు రీకాల్” అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికైన ప్రతినిధులు ఐదేళ్ల కాలం ముగిసే వరకు వేచి ఉండకుండా, సరిగ్గా పనితీరు చేయని వారిని ఓటర్లు తొలగించగలిగే అధికారం ఉండాలన్నారు. ప్రపంచంలో సుమారు 24 దేశాల్లో ఇలాంటి విధానం ఉందని గుర్తు చేశారు. దీనిపై కేంద్రం జాగ్రత్తగా స్పందించి. ప్రస్తుతం భారత రాజ్యాంగ వ్యవస్థ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంపై ఆధారపడిందని తెలిపింది. ఇలాంటి మార్పులు రాజకీయ అస్థిరతకు దారి తీసే అవకాశం ఉందని పేర్కొంది.
విమానాశ్రయాల్లో ఆహార ధరలు
విమానాశ్రయాల్లో సాధారణ ఆహార పదార్థాల ధరలు మార్కెట్ ధరకంటే ఎక్కువగా ఉన్నాయని ఆయన సభలో ప్రస్తావించారు. సాధారణంగా రూ.20కి లభించే నీటి బాటిల్ విమానాశ్రయాల్లో దాదాపు రూ.100కి విక్రయిస్తున్నారని తెలిపారు. ఇతర స్నాక్స్, పానీయాల ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సాధారణ ధరలలో స్నాక్స్, పానీయాలను అందించే ‘ఉడాన్ యాత్రి కేఫ్’ కేంద్రాలను పెంచాలని, భద్రతా తనిఖీ తర్వాత కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. పౌర విమానయాన శాఖ ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, అవసరమైతే అవుట్‌లెట్ల సంఖ్యను పెంచుతామని పేర్కొంది.
సిమ్ కార్డులు – ఇన్‌కమింగ్ కాల్స్
ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత అవుట్ గోయింగ్ మాత్రమే కాకుండా ఇన్‌కమింగ్ కాల్స్ నిలిపివేయడాన్ని రాఘవ్ చద్దా ప్రశ్నించారు. దాంతో పేదలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రీఛార్జ్ చేసుకోలేని పరిస్థితిలో.. ఇన్‌కమింగ్ కాల్స్ అందుకునే అవకాశం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ సేవలు, రేషన్, ఇతర ప్రభుత్వ పథకాల కోసం వినియోగదారుల ఫోన్ నంబర్లకు ఓటీపీలింక్ చేసిన ఈ పరిస్థితిలో ప్రజలు అనేక సేవలకు దూరమవుతున్నారన్నారు. కేంద్రం, ట్రాయ్ దీనిపై స్పందించింది. ఇంటర్నెట్ అవసరం లేని వినియోగదారులకు కేవలం వాయిస్-ఎస్ఎంఎస్ చౌక ప్లాన్లు అందించాలని ఆదేశించినట్లు తెలిపింది. గత 90 రోజుల పరిమితిని 365 రోజులు వరకు విస్తరించగల ప్రత్యేక టారిఫ్ వోచర్లు ప్రవేశపెట్టాలని టెలికాం కంపెనీలకు సూచించినట్లు పేర్కొంది.
రాజ్యసభలో రాఘవ్ చద్దా లేవనెత్తిన ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా వేదికగా ఆయనకు అనేక మంది ప్రశంసలు తెలిపారు. రాజకీయ విమర్శలకు మాత్రమే కాక, పేదలు, మధ్య తరగతి ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడిగినందుకు ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. ముఖ్యంగా పన్నుల విధానం, కార్మికుల హక్కులు, టెలికాం సేవల పరిస్థితులపై అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానాలు భవిష్యత్తులో విధాన నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






