త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Viral Video | మెట్రో స్టేష‌న్‌లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో త‌ల్లిదండ్రుల‌కు దొరికిపోయిన యువ‌కుడు.. త‌ల్లి చేసిన ప‌నికి అంతా షాక్‌

Viral Video | ఢిల్లీ మెట్రో (Delhi Metro) స్టేష‌న్ ఓ ప్రేమ జంట ఎంగేజ్మెంట్‌కు (engagement) వేదిక‌గా నిలిచింది. గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో ప‌ట్టుబ‌డిన కొడుకుకి ఓ మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే ఎంగేజ్మెంట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

D

National | Published On Feb 7, 2026, 4.11 pm IST

Viral Video | మెట్రో స్టేష‌న్‌లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో త‌ల్లిదండ్రుల‌కు దొరికిపోయిన యువ‌కుడు.. త‌ల్లి చేసిన ప‌నికి అంతా షాక్‌
Advertisement

Viral Video | ఢిల్లీ మెట్రో (Delhi Metro) స్టేష‌న్ ఇటీవ‌లే త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ప్ర‌యాణికుల చేష్ట‌లు, ముద్దు సీన్లు, డ్యాన్స్ రీల్స్‌తోపాటూ.. మెట్రో స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన అండ‌ర్‌వేర్ వెండింగ్ మెషీన్ కార‌ణంగా నిత్యం హెడ్‌లైన్స్‌లోకి ఎక్కుతోంది. ఇప్పుడు తాజాగా మ‌రోసారి ఢిల్లీ మెట్రో వార్త‌ల్లో నిలిచింది. అయితే ఈ సారి ఓ ప్రేమ జంట ఎంగేజ్మెంట్‌కు (engagement) ఢిల్లీ మెట్రో వేదిక‌గా నిలిచింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఓ మ‌హిళ ఢిల్లీ మెట్రో స్టేష‌న్‌కు వెళ్లింది. అయితే ఆమెకు అక్క‌డ అనుకోకుండా త‌న కొడుకు కనిపించాడు. ఓ అమ్మాయి (girlfriend)తో ముచ్చ‌ట‌లాడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. ఆ త‌ల్లి వెంట‌నే వారి ముందు ప్ర‌త్య‌క్ష్య‌మైంది. అంతే ఇంకేముంది త‌ల్లిని చూసి ఆ యువ‌కుడి కాళ్లూ, చేతులు వ‌ణికిపోయాయి. ఇంత వ‌ర‌కూ ఊహించిందే అయినా.. అక్క‌డే అస‌లు ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఆ త‌ల్లి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా.. ఆ అమ్మాయితో కొడుకుకి అక్క‌డిక‌క్క‌డే ఎంగేజ్మెంట్ జ‌రిపించింది. ఇద్ద‌రినీ ఓ చోట కూర్చోబెట్టి వారికి సంప్ర‌దాయ‌బ‌ద్దంగా పండ్లు, స్వీట్లు పెట్టింది. ఇంకో విశేషం ఏంటంటే ఆ యువ‌కుడి తండ్రి కూడా అక్క‌డే ఉండ‌టం. ఊహించ‌ని రీతిలో ఆ కొడుకు త‌ల్లిదండ్రుల స‌మ‌క్షంలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఆ కొడుకు ఎంత అదృష్ట‌వంతుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎలాంటి త‌గాదాల‌కు పోకుండా ఇంటి పరువు నిల‌బెట్టింది అంటూ త‌ల్లిని మెచ్చుకుంటున్నారు. ఇలాంటి త‌ల్లిదండ్రులు ప్ర‌తి ఒక్క‌రికీ ఉండాలంటూ స‌ర‌దాగా కామెంట్స్ చేస్తున్నారు.

https://x.com/NewsAlgebraIND/status/2020028425734615102

Advertisement
Advertisement