Mohan Bhagwat | బంగ్లాదేశ్ హిందువులు ఏకం కావాలి..
Mohan Bhagwat | బంగ్లాదేశ్‌లో హిందువులు ఐక్యత సాధించాలని, అప్పుడే రాజకీయ వ్యవస్థతో భద్రతతో పాటు ప్రయోజనాలు పొందుతారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
- అప్పుడే రాజకీయ వ్యవస్థతోనే భద్రత, ప్రయోజనాలు
- యూసీసీని అన్నివర్గాల అనుమతితో అమలు చేయాలి
- సావర్కర్‌కు భారత రత్న ఇస్తే మరింత గౌరవం
- ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ వ్యాఖ్యలు
Mohan Bhagwat | బంగ్లాదేశ్‌లో హిందువులు ఐక్యత సాధించాలని, అప్పుడే రాజకీయ వ్యవస్థతో భద్రతతో పాటు ప్రయోజనాలు పొందుతారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిఫాం సివిల్ కోడ్ (UCC)ను సమాజంలోని అన్ని వర్గాల సమ్మతితోనే అమలు చేయాలని, దాని పేరుతో ఎలాంటి విభజన ఉండకూడదని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలుకు ముందు దాదాపు మూడు లక్షల సూచనలు స్వీకరించారన్నారు. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన అనంతరమే చట్టాన్ని అమలు చేశారని తెలిపారు. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అనుసరించాలని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో సుమారు 1.25 కోట్ల మంది హిందువులు ఉన్నారని తెలిపారు. వారు ఐక్యంగా నిలిస్తే, అక్కడి రాజకీయ వ్యవస్థను తమ భద్రత, ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చన్నారు. ముందుగా ఐక్యత సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సారి హిందువులు అక్కడి నుంచి పారిపోకుండా.. అక్కడే ఉండి పోరాడాలని నిర్ణయించుకున్నారన్నారు. ఇది మంచి విషయమన్నారు. పోరాటం చేయాలంటే ఐక్యత తప్పనిసరన్న ఆయన.. ఎంత త్వరగా వారు ఏకమైతే అంత మంచిదని వ్యాఖ్యానించారు. బంగ్లా హిందువులు తమ పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుచుకోగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌తో పాటు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోసం సాధ్యమైనంత వరకు అన్నీ చేస్తామని భరోసా ఇచ్చారు.
దేశంలో మెజారిటీ, మైనారిటీ అనే భావనే లేదన్నారు. ఆధ్యాత్మికత లేని మతం దూకుడుగా, ఆధిపత్య ధోరణిగా మారుతుందని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇస్లాం, క్రైస్తవ మతాల్లో కనిపిస్తున్న పరిస్థితులు ప్రవక్త మహమ్మద్, యేసు క్రీస్తు అసలు బోధనలకు అనుగుణంగా లేవని వ్యాఖ్యానించారు. “నిజమైన ఇస్లాం, నిజమైన క్రైస్తవ మతాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది” అన్నారు. ఈ సందర్భంగా వీడీ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న అంశంపై స్పందించారు మోహన్ భగవత్. ఆయనకు ఈ గౌరవం లభిస్తే భారతరత్న గౌరవం మరింత పెరుగుతుందని తెలిపారు.
బీజేపీ అధికారంలోకి రావడం వల్ల ఆర్ఎస్ఎస్‌కు మంచిరోజులు రాలేదని.. కార్యకర్తల కృషి, సంస్థ సిద్ధాంతపరమైన నిబద్ధత వల్లే మంచిరోజులు వచ్చాయన్నారు. రామమందిర ఉద్యమ సమయంలో ఆర్ఎస్ఎస్‌తో కలిసి నిలిచినవారికే రాజకీయంగా లాభం జరిగిందన్నారు. తమ సంస్థ అవసరమైనప్పుడు మాత్రమే సలహాలు ఇస్తుందని.. రాజకీయంగా ఒత్తిడి చేయదని.. అది ఓటర్లతేనే సాధ్యమన్నారు. రాజకీయంగా జరిగిన తప్పులకు తమ తమపై నిందలు వేస్తుంటారని నవ్వుతూ తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఒక యువ సంస్థగా పేర్కొన్న భగవత్.. ప్రస్తుతం కార్యకర్తల సగటు వయసు 28 ఏళ్లు కాగా.. 25 ఏళ్లకు తగ్గించాలన్నే లక్ష్యమని చెప్పారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం మాట్లాడుతూ.. ఆ ఒప్పందంలోని సూక్ష్మ విషయాలను చూడలేదని.. ఏ అంతర్జాతీయ ఒప్పందమైన పరస్పర లాభనష్టాలు ఉంటాయన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






