త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | కాంగ్రెస్ దివాలా తీసింది..! ఏఐ స‌మ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిర‌స‌న‌పై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మోదీ..!

PM Modi | కాంగ్రెస్ పార్టీపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మీట‌ర్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని మాట్లాడారు. ఇటీవ‌ల ఇండియా-ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ 2026 సంద‌ర్భంగా యూత్ కాంగ్రెస్ నిర‌స‌న‌ల‌ను ప్ర‌స్తావించారు.

P

National | Published On Feb 22, 2026, 5.10 pm IST

PM Modi | కాంగ్రెస్ దివాలా తీసింది..! ఏఐ స‌మ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిర‌స‌న‌పై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మోదీ..!
Advertisement

PM Modi | కాంగ్రెస్ పార్టీపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మీట‌ర్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని మాట్లాడారు. ఇటీవ‌ల ఇండియా-ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ 2026 సంద‌ర్భంగా యూత్ కాంగ్రెస్ నిర‌స‌న‌ల‌ను ప్ర‌స్తావించారు. దేశంలోనే పురాతన రాజకీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ ఆలోచనాపరంగా దివాలా తీసిందని ఆ ఘటన వెల్లడించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన ఈ అంతర్జాతీయ స‌మ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం త‌దిత‌ర అంశాలపై నినాదాలు చేస్తూ అర్ధనగ్న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌ను మోదీ త‌ప్పుప‌ట్టు ప‌ట్టారు. దేశం అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్న వేళ కొన్ని రాజకీయ పార్టీలు ఆ పురోగతిని జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సదస్సును భార‌త్ నిర్వహించడం గర్వకారణమని, కానీ అదే వేదికను కాంగ్రెస్ రాజకీయ ఆజెండా కోసం వినియోగించుకుందని విమర్శించారు. విదేశీ అతిథుల సమక్షంలో కాంగ్రెస్ నేతలు అర్ధ‌న‌గ్నంగా నిరసన తెలపడం దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. “దేశానికి మీ రాజకీయ వైఖరి ఇప్పటికే తెలుసు. మళ్లీ ప్రపంచం ముందు ఇలా ప్రదర్శనలు అవసరమా?” అంటూ ప్రశ్నించారు. సొంత దేశ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పార్టీకీ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ మాత్రం దేశ పరువు తీసే ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం వేరే విషయ‌మ‌ని, జాతీయ స్థాయి కార్యక్రమంలో ఇలాంటి ప్రవర్తన హద్దులు దాట‌డ‌మేన‌న్నారు.

ఈ ఘటనపై పార్టీ అగ్రనేతలు నిరసనకారులను సమర్థించడం మరింత విచారకరమన్నారు. అయితే, ఇండియా కూటమిలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు ఈ చర్యను ఖండించినందుకు మోదీ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఏ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, అది దేశ గౌరవానికి సంబంధించిన జాతీయ వేదిక అన్నారు. ఇలాంటి రాజకీయాలు చేసే వారికి ప్రజలు తగిన సమాధానం చెబుతార‌న్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్‌-యూపీ ప్ర‌భుత్వ కాలంలో మౌలిక వ‌స‌తులు ప్రాజెక్టుల‌న్నీ అవినీతి, కుంభ‌కోణాల్లో చిక్కుకొని ముందుకు సాగ‌లేక‌పోయాయ‌ని ఆరోపించిన ప్ర‌ధాని.. త‌మ ప్ర‌భుత్వం అవినీతికి అడ్డుక‌ట్ట వేసి దేశాన్ని ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ మార్గంలో న‌డిపిస్తోంద‌న్నారు.

Advertisement
Advertisement