Parliament | మహిళల రిజర్వేషన్లు సహా మూడు కీలక బిల్లులు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధం..!
Parliament | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ సీట్ల సంఖ్యలో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో “సంవిధాన (131వ సవరణ) బిల్లు 2026”ని గురువారం ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
Parliament | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ సీట్ల సంఖ్యలో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో “సంవిధాన (131వ సవరణ) బిల్లు 2026”ని గురువారం ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ బిల్లుతో లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి మార్గం సుగమం కానుంది. ఇందుకోసం ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ్యుల సభ్యుల గరిష్టంగా 850 సీట్లకు పెంచే ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. బిల్లు ప్రకారం.. మొత్తం 850 మంది సభ్యుల్లో 815 రాష్ట్రాలకు, మిగతా 35 మంది స్థానాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రతిపాదించింది. అలాగే, ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 (లోక్‌సభ నిర్మాణం), ఆర్టికల్ 82 (డిలిమిటేషన్ ప్రక్రియ)లను సవరించేందుకు ప్రతిపాదిస్తుంది.
డీలిమిటేషన్‌పై కీలక మార్పు
ఇప్పటివరకు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జనగణన తర్వాత జరగాల్సి ఉండేది. అయితే, మహిళా రిజర్వేషన్ అమలులో ఆలస్యం జరగకుండా ఉండేందుకు ఈ నిబంధనలో మార్పులు చేయనున్నారు. కొత్త బిల్లు ప్రకారం, రాబోయే 2027 జనగణనను వేచి చూడకుండా ఇప్పటికే అందుబాటులో ఉన్న 2011 జనగణన గణాంకాల ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించే అవకాశం కల్పించారు. దీంతో మహిళలకు 1/3 రిజర్వేషన్ల అమలు సాధ్యం కానుంది. మహిళలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు అవకాశం లభించనుంది. జనగణన, తదనంతర డిలిమిటేషన్ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడంతో మహిళా ప్రాతినిధ్యం మరింత ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు బిల్లులో కేంద్రం పేర్కొంది.
డీలిమిటేషన్ కోసం కమిషన్..
కొత్త చట్టం మేరకు కేంద్రం డీలిమిటేషన్ కమిషన్‌ను సైతం ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు జడ్జిస్థాయి వ్యక్తిని చైర్మన్‌గా నియమించనుంది. సభ్యులుగా సీఈసీ, లేదంటే ఆయన ప్రతినిధి, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయనుంది. ఈ కమిషన్ మహిళలకు 35శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది. రొటేషన్ విధానంలో ఈ రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రవేశపెట్టనుండడంతో 2002లో తీసుకువచ్చిన డీలిమిటేషన్ చట్టం రద్దుకానుంది. డీలిమిటేషన్ చట్టంతో పాటు ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాల కోసం ప్రత్యేక చట్టాలను సైతం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 2న ముగిసినప్పటికీ కేంద్రం.. మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ సీట్ల పెంపునకు సంబంధించి బిల్లులను ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






