Student | మెడికల్ స్టూడెంట్ భిక్షాటన.. 47 రోజుల తర్వాత రక్షించి ఇంటికి చేర్చిన పోలీసులు..!
Student | కనిపించకుండా పోయిన ఓ వైద్య విద్యార్థిని ముంబయి పోలీసులు రక్షించారు. తీవ్ర మానసిక ఒత్తిడితో వీధుల్లో భిక్షాటన చేస్తున్న అతన్ని 47 రోజుల తర్వాత ఇంటికి చేర్పించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు అభయ్ సురేష్ బెల్కోని (25) బీహెచ్ఎంఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
Student | కనిపించకుండా పోయిన ఓ వైద్య విద్యార్థిని ముంబయి పోలీసులు రక్షించారు. తీవ్ర మానసిక ఒత్తిడితో వీధుల్లో భిక్షాటన చేస్తున్న అతన్ని 47 రోజుల తర్వాత ఇంటికి చేర్పించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు అభయ్ సురేష్ బెల్కోని (25) బీహెచ్ఎంఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఏప్రిల్ 4న జల్గావ్‌లోనూ కళాశాలకు వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ప్రయాణ సమయంలో రైలులో తన బ్యాగ్‌తో పాటు మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు.
దాంతో ముంబయిలోనే చిక్కుకుపోయాడు. చేతిలో డబ్బులు లేక, ఎవరినీ సంప్రదించలే అవకాశం లేకపోవడంతో జీవనోపాధి కోసం భిక్షాటన చేశాడు. మలాడ్ పశ్చిమ ప్రాంతంలోని ఎస్‌వీ రోడ్డుపై భిక్షాటన చేస్తున్న సమయంలో పోలీసులు గుర్తించి రక్షించారు. అభయ్ బలహీన పరిస్థితుల్లో కనిపించాడని, మానసిక పరిస్థితి సైతం సరిగా లేదని, దాంతో స్పష్టంగా మాట్లాడలేకపోయాడన్నారు. తన పేరు, స్వస్థలం తదితర వివరాలు మాత్రం చెప్పగలిగాడని మలాడ్ పోలీస్‌స్టేషన్ అధికారి తెలిపారు. అతని వివరాలను నాందేడ్‌లోని తాంసా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసుతో సరిపోల్చి నిర్ధారించారు.
విచారణలో రైలులో ప్రయాణిస్తున్న సమయంలో మొబైల్ ఫోన్, ఐడీ కార్డ్ సహా అన్ని వస్తువులు పోగొట్టుకున్నట్లు తెలిపాడు. డబ్బు లేక, కుటుంబాన్ని కాంటాక్ట్ అయ్యేందుకు వీలు లేకపోవడంతో భిక్షాటన చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఏప్రిల్ 6న స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫోన్ ద్వారా ఇంట్లోని వారికి ఒక్కసారి కాల్ చేయగా.. వివరాలు చెప్పే ముందే కాల్ కట్ అయినట్లు వివరించారు. ఆ తర్వాత కుటుంబీకులు అదే నంబర్‌కు మళ్లీ ఫోన్ చేయగా.. ఫోన్ ఎత్తిన వ్యక్తి అభయ్ ఎటో వెళ్లిపోయాడని తెలిపారు. ఆ తర్వాత కుటుంబీకులు విస్తృతంగా గాలించారు. మే 16న నాందేడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభయ్‌ని గుర్తించిన రోజు కుటుంబానికి అప్పగించినట్లు పోలీసులు వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CP Sajjanar | బక్రీద్ వేళ నకిలీ యాప్‌లతో మోసాలు.. వ్యాపారులను హెచ్చరించిన సీపీ సజ్జనార్
మే 26, 2026

Harbeer Singh | డ్రగ్స్ రాకెట్లో పంజాబీ సింగర్.. హర్బీర్ సింగ్ సోహైల్‌ను అరెస్టు చేసిన పోలీసులు..!
మే 26, 2026

Garima Agrawal | త్వరితగతిన కొనుగోళ్ళు పూర్తయ్యేలా చూడాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
మే 26, 2026
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?



