విజయ్ పార్టీ లీడర్లకు ముచ్చెమటలు పట్టించిన లేడి సింగం ‘ఇషా సింగ్’ ఎవరు?
తను ఎస్పీగా బాధ్యలు చేపట్టినప్పటి నుంచే పుదుచ్చేరిని ప్రశాంతంగా ఉంచేందుకు తను ఎన్నో చర్యలు చేపట్టారు. రాత్రి పూట పెట్రోలింగ్ పెంచడం, ఆటోరిక్షా డ్రైవర్లతో మాట్లాడటం, లేట్ నైట్ ఇంటికి వెళ్లే మహిళలకు రక్షణగా నిలవడం, యూత్‌ని మోటివేట్ చేయడం లాంటి మంచి పనులను చేస్తూనే ఉన్నారు.
డిసెంబర్ 9న పుదుచ్చేరిలో జరిగిన తమిళ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ సభను హ్యాండిల్ చేసింది ఈమెనే. పేరు ఇషా సింగ్. ఈమెను ఇప్పుడు అందరూ లేడీ సింగం అని పిలుస్తున్నారు. తను ఐపీఎస్ ఆఫీసర్. టీవీకే పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టించారు. టీవీకే పార్టీ నేతలను ఆమె హ్యాండిల్ చేసిన తీరుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాల్లో ఇషా సింగ్ పేరు మారుమోగిపోతోంది.
నిజానికి ఈ సభకు 5 వేల మందికి మాత్రమే అధికారులు పర్మిషన్ ఇచ్చారు. కానీ.. అక్కడ సభకు మాత్రం 5 వేల కంటే ఎక్కువ మంది రావడంతో వెంటనే అలర్ట్ అయిన ఇషా సింగ్.. అక్కడే ఉన్న టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్‌పై సింహంలా విరుచుకుపడ్డారు. సెప్టెంబర్ 28న జరిగిన ఘటనను గుర్తు చేస్తూ 40 మంది ప్రాణాలు తీశారు. ఆ విషయం మరిచిపోయారా? ఇప్పుడు మళ్లీ ఏం చేయాలనుకుంటున్నారు? అంటూ టీవీకే పార్టీ నేతల మీద సింహంలా గర్జించారు ఇషా సింగ్. ఆ వీడియో కొన్ని సెకన్లే ఉన్నా ఆ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం ఇషా సింగ్ నిజంగానే లేడీ సింగం అంటూ పొడుగుతున్నారు.
ఇషా సింగ్ నేపథ్యం ఇదీ
ఇషా సింగ్‌ది ముంబై. 1998 లో జన్మించారు. తన తండ్రి యోగేష్ ప్రతాప్ సింగ్ 1985 ఐపీఎస్ కేడర్ అధికారి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడి ఐపీఎస్ పోస్ట్‌కి రాజీనామా చేశారు. తన తల్లి అభా సింగ్.. ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిణి. తనకు లా మీద ఆసక్తి ఉండటంతో లా చదివి కొన్నేళ్లు లాయర్‌గా విధులు నిర్వర్తించారు. కోవిడ్ టైమ్‌లో తన మనసు యూపీఎస్‌సీ వైపు మళ్లడంతో రెండో అటెంప్ట్‌లో 133 వ ర్యాంకు సాధించి ఇషా సింగ్ ఐపీఎస్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

తను ఎస్పీగా బాధ్యలు చేపట్టినప్పటి నుంచే పుదుచ్చేరిని ప్రశాంతంగా ఉంచేందుకు తను ఎన్నో చర్యలు చేపట్టారు. రాత్రి పూట పెట్రోలింగ్ పెంచడం, ఆటోరిక్షా డ్రైవర్లతో మాట్లాడటం, లేట్ నైట్ ఇంటికి వెళ్లే మహిళలకు రక్షణగా నిలవడం, యూత్‌ని మోటివేట్ చేయడం లాంటి మంచి పనులను చేస్తూనే ఉన్నారు. తాజాగా టీవీకే పార్టీ రోడ్ షో వల్ల తన కమిట్‌మెంట్ అందరికీ తెలిసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






