త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Obsession Review | అబ్సెష‌న్ రివ్యూ – ఏడు కోట్ల బ‌డ్జెట్ – 1900 కోట్ల క‌లెక్ష‌న్స్ – హాలీవుడ్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

ఏడు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్ సైక‌లాజిక‌ల్ హార‌ర్ మూవీ అబ్సెష‌న్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 1900 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ హాలీవుడ్ మూవీ క‌థేమిటి? అంత‌లా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డానికి కార‌ణ‌మేమిటంటే?

N

Entertainment | Published On Jun 11, 2026, 11.58 am IST

Obsession Review | అబ్సెష‌న్ రివ్యూ – ఏడు కోట్ల బ‌డ్జెట్ – 1900 కోట్ల క‌లెక్ష‌న్స్ – హాలీవుడ్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?
Advertisement

Obsession Review |  అబ్సెష‌న్‌...సినీ ప్రేమికుల‌తో పాటు సెలిబ్రిటీల నోట వినిపిస్తున్న వినిపిస్తోన్న హాలీవుడ్ (Hollywood) సినిమా పేరు ఇది. కేవ‌లం ఏడు కోట్ల బ‌డ్జెట్‌లో లిమిటెడ్ క్యారెక్ట‌ర్ల‌తో రూపొందించిన ఈ చిన్న సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 1900 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. యూట్యూబ‌ర్ క‌ర్రీ బార్క‌ర్ రూపొంద‌దించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ర్గాల‌నే కాకుండా దిగ్గ‌జ ద‌ర్శ‌కుల‌ను సైతం విస్మ‌యానికి గురిచేస్తోంది. సైక‌లాజిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా (Horror Movie) రూపొందిన ఈ హాలీవుడ్ మూవీ  ఇటీవ‌లే ఇండియాలో థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అబ్సెష‌న్‌ సినిమా ఎలా ఉందంటే?

వ‌న్ విష్ విల్లో....

బేర్‌, నిక్కీ ఫ్రీమాన్ ఓ మ్యూజిక్ స్టోర్‌లో ప‌నిచేస్తుంటారు. నిక్కీని బేర్ ప్రేమిస్తుంటాడు. త‌న మ‌న‌సులోని మాట‌ను ఆమెతో చెప్ప‌డానికి భ‌య‌ప‌డుతుంటాడు. వ‌న్ విష్ విల్లో అనే తాంత్రిక శ‌క్తులు ఉన్న బొమ్మ గురించి బేర్‌కు తెలుస్తుంది. ఆ బొమ్మ‌ను విరిచేసి ప్ర‌పంచంలో అంద‌రికంటే ఎక్కువ‌గా నిక్కీ త‌న‌నే ప్రేమించాల‌ని కోరుకుంటాడు. ఆ బొమ్మ విరిచిన‌ప్ప‌టి నుంచి నిక్కీ ద‌య్యం ప‌ట్టిన దానిలా మారిపోతుంది. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌తో బేర్ భ‌య‌ప‌డిపోతాడు. బేర్ ప్రేమ కోసం త‌న స్నేహితురాలు సారానే దారుణంగా చంపేస్తుంది నిక్కీ. వ‌న్ విష్ విల్లో బారి నుంచి నిక్కీని బేర్ కాపాడాడా? ఆ బొమ్మ వ‌ల్లే నిక్కీ అలా మారిపోయిందా? నిజంగానే బేర్‌ను నిక్కీ ప్రేమించిందా? నిక్కీ ప్రాణాలు కాపాడటం కోసం బేర్ ఎలాంటి త్యాగానికి సిద్ధ‌ప‌డ్డాడు అన్న‌దే అబ్సెష‌న్ మూవీ క‌థ‌.

అతి ప్రేమ....

అబ్సెష‌న్ ఇదొక హార‌ర్ మూవీ అంటూ చాలా మంది ప్ర‌చారం చేస్తున్నారు. కానీ హార‌ర్ ఎలిమెంట్స్ కంటే సైక‌లాజిక‌ల్ అంశాల‌కే ఎక్కువ‌గా ప్రాధాన్య‌మిస్తూ ద‌ర్శ‌కుడు క‌ర్రీ బార్క‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ప్రేమ‌, ఇష్టం అన్న‌వి స‌హ‌జంగా పుట్టాలి. అవి మితంగానే ఉండాలి. ఎదుటి వ్య‌క్తి ఇష్టాఇష్టాల‌తో ప్ర‌మేయం లేకుండా అడ్డ‌దారుల్లో ఆ ప్రేమ‌ను ద‌క్కించుకోవాల‌ని చూస్తే ఏం జ‌రుగుతుంది? ఆ ప్రేమ అతిగా మారితే ఎలాంటి అన‌ర్థాలు త‌లెత్తుతాయి అన్న‌ది చాలా వ‌య‌లెంట్‌గా ఈ సినిమాలో చూపించారు. స్వార్థంతో చేసే స‌రిదిద్దుకోలేని త‌ప్పుల వ‌ల్ల‌ జీవితాలు ఏ విధంగా నాశ‌నం అవుతాయ‌న్న‌ది భ‌య‌పెట్టేలా స్క్రీన్‌పై ఆవిష్క‌రించారు.

ద‌య్యాలు లేకుండానే....

బేర్‌, నిక్కీతో పాటు ఇయాన్, సారా పాత్ర‌ల ప‌రిచ‌యం, బేర్ వ‌న్ సైడ్ ల‌వ్‌తో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. డైరెక్ట‌ర్‌. ఎప్పుడైతే వ‌న్ విష్ విల్లోను బేర్ విరిచేస్తాడో అప్ప‌టి నుంచే క‌థ ఇంట్రెస్టింగ్‌గా మారిపోతుంది. రెగ్యుల‌ర్ హార‌ర్ సినిమాల్లో మాదిరిగా విచిత్ర‌మైన ఆకారాల‌తో ద‌య్యాలు ఈ సినిమాలో క‌నిపించ‌వు. లేనివాటిని ఉన్న‌విగా ఊహించుకుంటూ బేర్ భ‌య‌ప‌డే సీన్స్‌తో హార‌ర్ ఫీల్ క‌లిగించారు. హీరో మాత్ర‌మే కాకుండా ఆడియెన్స్‌ను కూడా ఆ సీన్లు వ‌ణికిస్తాయి. నిక్కీ త‌న‌ను తాను గాయ‌ప‌రుచుకునే ఎపిసోడ్‌, సారాపై ఎటాక్ చేసే స‌న్నివేశాలు చాలా వ‌య‌లెంట్‌గా ఉంటాయి.

బోల్డ్ సీన్లు...

త‌న త‌ప్పును స‌రిదిద్దుకోవ‌డానికి హీరో ప‌డే సంఘ‌ర్ష‌ణతో చివ‌రి వ‌ర‌కు థ్రిల్లింగ్‌గా ఈ సినిమా సాగుతుంది. నిక్కీ నెక్స్ట్ ఏం చేస్తుందో అని ఆడియెన్స్ ఎదురుచూసేలా టెన్ష‌న్ బిల్డ్ చేశారు. ఈ క‌థ‌లోనే అంత‌ర్లీనంగా ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీని ట‌చ్ చేశారు. నిక్కీ, సారాల‌లో నిజంగా బేర్‌ను ఎవ‌రు ప్రేమించారు? ఇయాన్‌తో నిక్కీకి ఉన్న రిలేష‌న్ ఏమిటి? అస‌లు నిక్కీ బేర్ మ‌ధ్య ఉన్న‌ది ప్రేమ‌బంధ‌మేనా అనే అంశాల‌ను చూపించిన తీరు బాగుంది. క్లైమాక్స్ త‌న తెలుగు సినిమాల‌కు భిన్నంగా ఉంటుంది. సినిమాలో కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అవి కొంత ఇబ్బంది పెడ‌తాయి.

వేరియేష‌న్స్‌....

చాలా త‌క్కువ బ‌డ్జెట్‌లో ప‌రిమిత పాత్ర‌ల‌తో అబ్సెష‌న్ మూవీని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు. సినిమాలో చాలా వ‌ర‌కు నిక్కీ బేర్ మాత్ర‌మే క‌నిపిస్తారు. నిక్కీ పాత్ర‌లో న‌వ‌రెట్టే అద‌ర‌గొట్టింది. నార్మ‌ల్ అమ్మాయిగా, వ‌న్ విష్ విల్లో కార‌ణంగా సైకోగా మారిన ప్రేమికురాలిగా క్యారెక్ట‌ర్‌లో చూపించిన వేరియేష‌న్స్ ఈ సినిమాకు హైలైట్‌. ఆమె న‌ట‌నే ఈ సినిమాను నిల‌బెట్టింది. బేర్‌గా మైఖేల్ జాన్స‌న్ ఎమోష‌న‌ల్ రోల్‌లో ఆక‌ట్టుకున్నాడు. కూప‌ర్ టామ్లిల్స‌న్‌, మెగాన్ లాలెస్ న‌ట‌న ఒకే.
అబ్సెష‌న్ మిస్ కాకుండా చూడాల్సిన‌ సైక‌లాజిక‌ల్ హార‌ర్ మూవీ. ర‌న్ టైమ్ త‌క్కువే.

Advertisement
Advertisement