El Nino | ఎల్ నినో ప్రభావం.. రుతుపవనాలకు అంతరాయం
El Nino | రాష్ట్రంలో రుతుపవనా విస్తరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఎల్ నినో (El Nino) ప్రభావంతో ఈ నెల 17 లేదా 18 వరకు రుతుపవనాలకు అంతరాయం కలుగనుంది.
Flash news | Published On Jun 11, 2026, 11.44 am IST
El Nino | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో రుతుపవనా విస్తరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఎల్ నినో (El Nino) ప్రభావంతో ఈ నెల 17 లేదా 18 వరకు రుతుపవనాలకు అంతరాయం కలుగనుంది. దీంతో దక్షిణ తెలంగాణలో (Telangana) రుతుపవనాలు (Monsoon) నిలిచిపోతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని మిగిలిన 70 శాతం ప్రాంతాల్లో వేసవి తాపం దీర్ఘకాలం కొనసాగి, రుతుపవనాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతాయని చెప్పింది. హైదరాబాద్‌లో మళ్లీ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరతాయని పేర్కొంది. అయితే రుతుపవనాలు నిలిచిపోయినప్పటికీ, అధిక వేడి కారణంగా రాబోయే కొద్ది రోజుల్లో, ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని రుతుపవన ప్రాంతాలు, తూర్పు, పశ్చిమ తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో జూన్ 17 లేదా 18 వరకు అధిక వేడి, వడగాలులు కొనసాగుతాయని వెల్లడించింది. ఆ తర్వాత అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది.
అత్యంత వేడి సంవత్సరంగా 2026!
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించకపోవడమే కాకుండా, అనిశ్చితి నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షానికి - వర్షానికి మధ్య దూరం (లాంగ్ డ్రైస్పెల్స్), తక్కువ వర్షపాతం వంటి సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావం ఈ ఏడాదితో ముగిసిపోకుండా 2027లోనూ ఉండొచ్చని అంచనా వేశారు. ఇలా రెండేండ్ల పాటు ఎల్‌నినో కొనసాగడం చాలా అరుదని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశ చరిత్రలో అత్యంత వేడి సంవత్సరంగా 2024కు రికార్డు ఉంది. తాజా పరిస్థితులను గమనిస్తే 2026 దానిని అధిగమించవచ్చన్నారు. 1950 నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 1982, 1991, 1997, 2015లో ఇలాంటి సూపర్ ఎల్నినోలు ఏర్పడ్డాయని చెప్పారు. 1982లో 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు.
సంబంధిత వార్తలు

Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి
జూన్ 11, 2026

Harish Rao | 5 వేల పోస్టులకు కాదు.. 19 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్
జూన్ 11, 2026

Madhavi Latha | తెలంగాణపై విషం చిమ్మిన మాధవీలత.. ఆజాద్ కశ్మీరీలలా ప్రవర్తిస్తున్నారంటూ కామెంట్స్
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు
- ●Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి
- ●Bill Gates | అక్రమ సంబంధాలను అడ్డుపెట్టుకుని నాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు.. ఎప్స్టీన్పై బిల్‌గేట్స్ సంచలన ఆరోపణలు
- ●Harish Rao | 5 వేల పోస్టులకు కాదు.. 19 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్
- ●Airtel | రూటు మార్చిన ఎయిర్టెల్.. ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ ను ఫాస్ట్ లేన్‌గా మార్పు..
- ●Madhavi Latha | తెలంగాణపై విషం చిమ్మిన మాధవీలత.. ఆజాద్ కశ్మీరీలలా ప్రవర్తిస్తున్నారంటూ కామెంట్స్

Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు

Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి

Bill Gates | అక్రమ సంబంధాలను అడ్డుపెట్టుకుని నాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు.. ఎప్స్టీన్పై బిల్‌గేట్స్ సంచలన ఆరోపణలు

Harish Rao | 5 వేల పోస్టులకు కాదు.. 19 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్



