త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Selfie | నీల‌గిరి కొండ‌ల్లో సెల్ఫీ.. 100 అడుగుల లోయ‌లో ప‌డిపోయిన యువ‌కుడు

Selfie | సెల్ఫీ (Selfie) మోజు ఓ వ్య‌క్తి ప్రాణాల మీద‌కు తీసుకొచ్చింది. నీల‌గిరి కొండ‌ల్లో (Nilgiri Hills) ప్రకృతి అందాల‌కు ప‌ర‌వ‌శించి పోయిన అత‌డు త‌న సెల్‌ఫోన్‌లో బంధించాల‌నుకున్నాడు. ఈ క్ర‌మంలో లోయ‌లో (Valley) ప‌డిపోయాడు.

G

National | Published On Mar 20, 2026, 11.28 am IST

Selfie | నీల‌గిరి కొండ‌ల్లో సెల్ఫీ.. 100 అడుగుల లోయ‌లో ప‌డిపోయిన యువ‌కుడు
Advertisement

Selfie | త్రినేత్ర‌.న్యూస్: సెల్ఫీ (Selfie) మోజు ఓ వ్య‌క్తి ప్రాణాల మీద‌కు తీసుకొచ్చింది. నీల‌గిరి కొండ‌ల్లో (Nilgiri Hills) ప్రకృతి అందాల‌కు ప‌ర‌వ‌శించి పోయిన అత‌డు త‌న సెల్‌ఫోన్‌లో బంధించాల‌నుకున్నాడు. ఈ క్ర‌మంలో లోయ‌లో (Valley) ప‌డిపోయాడు. త‌మిళ‌నాడులోని చెంగ‌ల్‌ప‌ట్టు జిల్లాకు చెందిన శివగురునాథ‌న్ నీల‌గిరి కొండ‌ల‌ను చూడ‌టానికి వెళ్లాడు. నీల‌గిరి హిల్స్‌లోని సుంద‌ర‌మైన దృష్యాల‌కు నెల‌వైన‌ నీడిల్ రాక్ వ్యూ పాయింట్ (Oosimalai)కు చేరుకున్నాడు. ప్ర‌కృతి అందాల‌ను చూసి మైమ‌ర‌చి పోయాడు. ఆ దృశ్యాల‌ను త‌న ఫోన్‌లో బంధించాల‌నుకున్న అత‌డు.. సెల్ఫీ తీసుకుండ‌గా 100 ఫీట్ల లోతైన నిటారైన‌ లోయ‌లో జారి ప‌డిపోయాడు.

దీంతో స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. వెలుతురు లేమి, క‌ఠిన‌మైన భూభాగం కావ‌డంతో శివ‌గురునాథ‌న్‌ను గుర్తించ‌డంలో ఆల‌స్య‌మైంది. అత‌ని ఆచూకీ గుర్తించిన స‌హాయ‌క బృందాలు.. బాధితుని వ‌ద్ద‌కు చేరుకుని ప్ర‌థ‌మ చికిత్స అందించాయి. అయితే లోయ లోతుగా ఉండటం, రాతితో కూడుకున్న భూభాగం కావ‌డంతో అతడిని తిరిగి పైకి తీసుకురావడం కష్టమైంది.

Advertisement

తాజావార్తలు

Advertisement