త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Bengal | బీజేపీ రిగ్గింగ్‌కు పాల్ప‌డుతోంద‌న్న మ‌మ‌త‌.. స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన సువేందు..!

West Bengal | బెంగాల్‌లో రెండోద‌శ అసెంబ్లీ ఎన్నిక‌ల వేల రాజ‌కీయాలు వేడెక్కాయి. ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర బ‌ల‌గాలు, ఎన్నిక‌ల సిబ్బంది బీజేపీకి స‌హ‌కారం అందిస్తున్నార‌ని ఆరోపించారు. దీదీ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత సురేందు అధికారి కౌంట‌ర్ ఇచ్చారు. ఆమెకు ఎవ‌రూ ఓటు వేయ‌డం లేద‌న్నారు.

P

National | Published On Apr 29, 2026, 12.24 pm IST

West Bengal | బీజేపీ రిగ్గింగ్‌కు పాల్ప‌డుతోంద‌న్న మ‌మ‌త‌.. స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన సువేందు..!
Advertisement

West Bengal | ప‌శ్చిమ బెంగాల్‌లో రెండోద‌శ ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓట‌ర్లు క్యూ క‌ట్టి త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణ మ‌రింత వేడెక్కింది. కీలకమైన 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుండగా, భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ బీజేపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీ రిగ్గింగ్‌కు పాల్ప‌డుతోంద‌ని, ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయాల్సిన పరిస్థితి లేద‌ని, కేంద్ర బలగాలు, ఎన్నికల పరిశీలకులు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.

ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన అధికారులు బీజేపీ ఆదేశాల మేర‌కు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. టీఎంసీ పోస్టర్లు, జెండాలు బలవంతంగా తొలగించారని మండిప‌డ్డారు. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఓ కౌన్సిల‌ర్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశార‌ని, టీఎంసీ కార్యకర్తలపై రాత్రి వేళ దాడులు జరిగాయని మమత పేర్కొన్నారు. దీన్ని గూండాగిరిగా అభివ‌ర్ణించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత వాతావరణంలో జరగాల్సిన పోలింగ్‌ను బీజేపీ చెడగొట్టిందని మండిప‌డ్డారు.

మ‌రోవైపు భ‌వానీపూర్‌లో మ‌మ‌త‌పై పోటీ చేస్తున్న బీజేపీ నేత సువేందు అధికారి ఓట‌ర్లు పోలింగ్‌లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. మ‌మ‌తా బెన‌ర్జీ వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించారు. ఈ ఎన్నిక‌లు రాష్ట్ర భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించ‌డంలో కీల‌క ఘ‌ట్ట‌మ‌ని తెలిపారు. మమత పెద్ద ఎత్తున అనుచరులతో పోలింగ్ కేంద్రాలకు రావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థిగా ఆమెకు బూత్‌లను సందర్శించే హక్కు ఉన్నా, మంది మార్బ‌లాన్ని వెంటేసుకొని రావ‌డం స‌రైంది కాద‌న్నారు. ఇది ఓటర్లను భయపెట్టే ప్రయత్నమని ఆరోపించారు. మ‌మ‌తా బెన‌ర్జీకి ఎవ‌రూ ఓటు వేయ‌డం లేద‌ని, ఆమె గుండాలూ ఓటర్లను బెదిరిస్తున్నారని విమ‌ర్శించారు. మరీ ముఖ్యంగా హిందూ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని టీఎంసీ బెదిరింపులు కొనసాగుతున్నాయ‌న్నారు. బెంగాల్‌లో బీజేపీ గెలుపు థ‌త్య‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

బెంగాల్‌లో రెండో విడ‌త ఎన్నిక‌ల పోలింగ్ ఉద‌యం 7 గంట‌ల‌కు మొద‌లైంది. సాయంత్రం 6గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. కొలకతా, హౌరా, హూగ్లీ, నదియా, ఉత్తర-దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున బూత్‌ల వద్ద క్యూలలో బారులు తీరారు. సుమారు 3.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 41,001 పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు తెలిపారు. మ‌రో వైపు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సైతం ప్ర‌జ‌లు ఓటింగ్‌లో పాల్గొనాల‌ని కోరారు. యువ‌త ముందుకువ‌చ్చి ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేయాల‌ని కోరారు. మే 4న ఫలితాలను ఈసీ ప్ర‌క‌టించ‌నుంది.

Advertisement
Advertisement