త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Budda Prakash | రోజూ 50 వేల టన్నుల బొగ్గు రవాణా చేద్దాం: సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి

Budda Prakash | రోజుకు 45 నుంచి 50 వేల టన్నుల బొగ్గు (Coal) రవాణా చేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ‌ ప్రకాష్ జ్యోతి ఆదేశించారు. ఇందుకు జేవీఆర్ (JVR) కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో సాంకేతిక సమస్యలను అధిగమించాల‌ని సూచించారు. ఒడిశా(Odisha)లోని నైనీ బ్లాక్(Naini block) నుండి ఏడాది 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని కోరారు.

S

News | Published On Apr 24, 2026, 6.25 pm IST

Budda Prakash | రోజూ 50 వేల టన్నుల బొగ్గు రవాణా చేద్దాం: సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి
Advertisement
  • నైనీ బొగ్గు బ్లాకు నుంచి ఈ ఏడాది 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలి
  • ఇందుకు ప్ర‌త్యేక చొర‌వ అవ‌స‌రం
  • సత్తుపల్లి సి.హెచ్.పిలోనూ ఏర్పాట్లు చేయాలి
  • సమీక్షా సమావేశంలో సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ఆదేశం

Budda Prakash | త్రినేత్ర‌.న్యూస్‌: రోజుకు 45 నుంచి 50 వేల టన్నుల బొగ్గు (Coal) రవాణా చేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ‌ ప్రకాష్ జ్యోతి ఆదేశించారు. ఇందుకు జేవీఆర్ (JVR) కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో సాంకేతిక సమస్యలను అధిగమించాల‌ని సూచించారు. ఈ ప్లాంటు నుండి పూర్తి స్థాయిలో బొగ్గు రవాణా జరిగే విధంగా చూడాలన్నారు. ఇక్క‌డి నుంచి ఏడాదికి కోటి టన్నులకు పైగా బొగ్గు రవాణా అవుతున్న‌ట్లు తెలిపారు. అలాగే ఒడిశా(Odisha)లోని నైనీ బ్లాక్(Naini block) నుండి ఏడాది 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని, స్థానిక ప్రభుత్వ అధికారులు, ప్రజల సహకారంతో లక్ష్యాలు సాధించాలని సూచించారు. హైదరాబాద్(Hyderabad) సింగరేణి భవన్ లో శుక్ర‌వారం ఆయన ఈ రెండు కీలక అంశాలపైన ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జేవీఆర్-2 ఓపెన్ కాస్ట్ గని నుంచి 11 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు..

సత్తుపల్లి ఏరియా నుంచి ప్రతీ రోజు సుమారు 50 వేల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉంటుందన్నారు. కోల్ బంకర్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యలను పరిష్కరించుకొని ఏరియా నుంచి బొగ్గు రవాణాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కోరారు. సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్-2 ఓపెన్ కాస్ట్ గని నుండి ఈ ఆర్థిక సంవత్సరం 11 మిలియన్ టన్నుల బొగ్గు, కిష్టారం ఓపెన్ కాస్ట్ గని నుండి 24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సి.హెచ్.పి ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి తగు చర్యలను చేపట్టాలని ఛైర్మన్ ఆదేశించారు. ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ సి.హెచ్.పి సంపూర్ణ వినియోగానికి చేపడుతున్న చర్యలను ఈ సంద‌ర్భంగా వివరించారు.

6 మిలియ‌న్ ట‌న్నుల నైనీ బొగ్గు ల‌క్ష్యం..

కాగా ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాకుకు ఈ ఏడాది 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. కోల్ కారిడార్ రోడ్డు నిర్మాణం పూర్తవడానికి కొంత సమయం పడుతుందని, సమీపంలోని రైల్వే సైడింగులకు రోడ్డు మార్గం ద్వారా బొగ్గును రవాణా చేయాలని స్ప‌ష్టం చేశారు. నైనీ బొగ్గు బ్లాక్ నుండి సమీపంలోని రైల్వే సైడింగుల వరకు బొగ్గు రవాణాకు తీసుకుంటున్న చర్యలను జనరల్ మేనేజర్ బైద్య వివరించారు. ఈ గనిలో పనిచేయడానికి కావలసిన అధికారులు, కార్మికులు, సూపర్ వైజర్ సిబ్బంది అవసరాన్ని ఆయన ఛైర్మన్ కు నివేదించారు.

ఈ సమీక్షలో సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్, కోఆర్డినేషన్) టి. శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement