త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple Services Outage | స్తంభించిన ఆపిల్ సేవ‌లు.. ఇబ్బందిప‌డ్డ యూజ‌ర్లు

Apple Services Outage | భార‌త్‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆపిల్ సేవ‌లు స్తంభించాయి. అక‌స్మాత్తుగా సేవ‌లు నిలిచిపోయాయి. యాప్ స్టోర్, ఐట్యూన్స్ స్టోర్, ఆపిల్ టీవీ స‌హా ప‌లు సేవ‌ల‌ను యాక్సెస్ చేయ‌డంలో వినియోగ‌దారులు ఇబ్బందులుప‌డ్డారు.

P

Business | Published On Jan 21, 2026, 5.41 pm IST

Apple Services Outage | స్తంభించిన ఆపిల్ సేవ‌లు.. ఇబ్బందిప‌డ్డ యూజ‌ర్లు
Advertisement

Apple Services Outage | భార‌త్‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆపిల్ సేవ‌లు స్తంభించాయి. అక‌స్మాత్తుగా సేవ‌లు నిలిచిపోయాయి. యాప్ స్టోర్, ఐట్యూన్స్ స్టోర్, ఆపిల్ టీవీ స‌హా ప‌లు సేవ‌ల‌ను యాక్సెస్ చేయ‌డంలో వినియోగ‌దారులు ఇబ్బందులుప‌డ్డారు. ప‌లువురు వినియోగ‌దారులు కొత్త యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోలేక ఇబ్బందులుప‌డుతున్నారు. కంటెంట్‌ను కొనుగోలు చేయ‌లేక‌పోవ‌డం, స్ట్రీమ్ చేయ‌లేక‌పోయారు. ఆపిల్ సిస్టమ్ స్టేటస్ పేజీ ప్రకారం.. సాంకేతిక లోపాలు ఉదయం 5.18 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యాయి. యాప్ స్టోర్, ఐట్యూన్స్ స్టోర్‌లో మొద‌ల స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. ఆ త‌ర్వాత ఆపిల్ టీవీ, ఆపిల్ టీవీ ఛానెల్స్‌లోనూ స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. యూజ‌ర్లు ఇష్ట‌మైన షోలు, చానెల్స్‌ను లోడ్ చేయ‌లేక‌పోయారు.

భార‌త్‌లో ఉద‌యం 6.45 గంట‌ల‌కు స‌మ‌స్య ఎదురైంది. ఆపిల్ సేవ‌లన్నీ స్తంభించాయి. వినోదంతో పాటు నావిగేష‌న్ టూల్స్ సైతం ప్ర‌భావిత‌మ‌య్యాయి. ఐక్లౌడ్ ఐవ‌ర్క్‌, ఎక్స్‌కోడ్ క్లౌడ్ (డెవలపర్‌), ఆపిల్ మ్యాప్స్ ట్రాఫిక్ సేవ‌ల్లో అంత‌రాయం క‌లిగింది. భార‌త్‌లోనూ ప‌లువురు యూజ‌ర్స్ ఇబ్బందులు ప‌డ్డారు. ప‌లువురు కొత్త యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయ‌డంలో ఇబ్బందిప‌డ్డారు. పాత యాప్స్‌ను సైతం అప్‌డేట్ చేయ‌లేక‌పోయారు. అలాగే ఐ క్లౌడ్‌లో ఉన్న డాక్యుమెంట్స్‌ను యాక్సెస్ చేయ‌డానికి ఇబ్బందిప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా.. వైబ్‌సైట్స్ ట్రాక‌ర్ డౌన్ డిటెక్ట‌ర్‌లోనూ ప‌లువురు తాము స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ట్లు రిపోర్ట్ చేశారు. అయితే, ఈ సాంకేతిక స‌మ‌స్య‌కు ఆపిల్ కార‌ణాల‌ను వెల్ల‌డించ‌న‌ప్ప‌టికీ.. భార‌త్‌లో అనేక సేవ‌లు తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యాయి. ఈ స‌మ‌స్య చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే వ‌చ్చింద‌ని.. కొంద‌రు యూజ‌ర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని, కొంద‌రికి ఇబ్బందులుంటాయ‌ని తెలిపింది. కంపెనీ అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌కుండా కేవ‌లం సిస్ట‌మ్ స్టేట‌స్ పేజీని అప్‌డేట్ చేస్తూ వ‌చ్చింది.

Advertisement

తాజావార్తలు

Advertisement