Renu Desai | పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఇటీవల ఆమె వీధి కుక్కల సంరక్షణ, వాటి దాడుల నివారణపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్లపై ఆగ్రహం తన పేరు చెప్పుకొని తప్పుడు థంబునెయిల్స్ పెట్టి, గాసిప్స్ పుట్టించి వాటి ద్వారా యూట్యూబ్‌లో డబ్బు సంపాదిస్తున్న యూట్యూబర్లపై రేణు దేశాయ్ విరుచుకుపడ్డారు. ఆ డబ్బు శపించబడిన సొమ్ము అని, వాళ్లు ఖచ్చితంగా అనుభవిస్తారని శాపనార్థాలు పెట్టారు. నేను ఒంటరిదాన్ని తన వ్యక్తిగత జీవితం, పిల్లలపై వస్తున్న విమర్శలపై స్పందించిన రేణు.. తనను రక్షించడానికి ఎవ్వరూ లేరని, తాను ఒంటరిగా పోరాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని, సామాజిక సేవ కోసమే పని చేస్తున్నానని స్పష్టం చేశారు. తనపై వస్తున్న రాజకీయ పుకార్లను నమ్మొద్దని కోరారు. సెకండ్ ఇన్నింగ్స్ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రేణు దేశాయ్.. ప్రాధాన్యత ఉండే పాత్రలనే ఎంచుకుంటున్నారు. మహేశ్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో తనకు అవకాశం వచ్చినా, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు ఇటీవల రేణు వెల్లడించిన విషయం తెలిసిందే.