LPU | ఎల్పీయూలో 10 రోజుల పాటు క్లాసులు బంద్.. మిడ్ టర్మ్ పరీక్షలు వాయిదా
LPU | పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో గత రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో క్యాంపస్‌లో క్లాసులను 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు (Classes Suspended) వర్సిటీ యాజమాన్యం ప్రకటించింది.
LPU | త్రినేత్ర న్యూస్: పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో గత రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో క్యాంపస్‌లో క్లాసులను 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు (Classes Suspended) వర్సిటీ యాజమాన్యం ప్రకటించింది. వర్సిటీ హాస్ట్‌లో ఉంటున్న ఓ విద్యార్థినిపై ఓ ప్లంబర్ లైంగికదాడికి పల్పడ్డాడని, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆందోళనలకు దారితీసింది. శనివారం రాత్రి ప్రారంభమైన విద్యార్థుల నిరసనలు (Protests) ఆదివారం కూడా కొనసాగింది. వందలాది మంది విద్యార్థులు ఢిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారిని దిగ్భందించారు. అనంతరం క్యాంపస్‌లోకి దూసుకెళ్లి సామాగ్రిని ధ్వంసం చేశారు. కొన్ని భవనాలకు నిప్పంటించారు.
ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో అప్రమత్తమైన వర్సిటీ యాజమాన్యం సోమవారం (సెప్టెంబర్ 28) నుంచి రెగ్యులర్ తరగతులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు మిట్ టర్మ్ పరీక్షలను (Mid-Term Examinations) కూడా వాయిదా (Postponed) వేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇది అమల్లో ఉంటుందని ప్రకటించారు. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (UMS) ద్వారా విద్యార్థులకు తెలియజేస్తామని వెల్లడించింది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, అధికారిక సూచనలను పాటించాలని కోరింది. ఈ 10 రోజుల విరామ సమయంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతితో సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతించింది. క్యాంపస్‌లోనే ఉండాలనుకునే విద్యార్థులు తమ హాస్టళ్లు లేదా నివాస గృహాలకే పరిమితం కావాలని, అనవసరంగా బయట తిరగవద్దని, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు

Bank Employees Strike | వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా
సెప్టెంబర్ 28, 2026

CUET UG | మే 28న జరగాల్సిన సీయూఈటీ యూజీ పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
మే 25, 2026

SBI Employee Strike | బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా.. వరుసగా ఐదు రోజుల సెలవులకు బ్రేక్..
మే 23, 2026
తాజావార్తలు
- ●Murder | కష్టపడి జీవించమన్నందుకు కన్న తండ్రిని చంపిన కొడుకు
- ●MLC Elections | నేటి నుంచి పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ షురూ.. ఏర్పాట్లు చేస్తున్న రాజకీయ పార్టీలు
- ●Bank Employees Strike | వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా
- ●Horoscope | సెప్టెంబర్ 28 రాశిఫలాలు.. మీ రూపురేఖలు, వ్యక్తిత్వంపై శ్రద్ధ చూపుతారు!
- ●US Visitor Visa Hyderabad | అమెరికా టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏడాది ఆగాల్సిందే.. హైదరాబాద్‌లోనే అత్యధిక వెయిటింగ్ పీరియడ్
- ●Mobile Number Leak Signs | తరచూ స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయా? మీ ఫోన్ నంబర్ హ్యాక్ అయినట్టే.. సేఫ్టీ కోసం వెంటనే ఇలా చేయండి

Murder | కష్టపడి జీవించమన్నందుకు కన్న తండ్రిని చంపిన కొడుకు

MLC Elections | నేటి నుంచి పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ షురూ.. ఏర్పాట్లు చేస్తున్న రాజకీయ పార్టీలు

Bank Employees Strike | వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా

Horoscope | సెప్టెంబర్ 28 రాశిఫలాలు.. మీ రూపురేఖలు, వ్యక్తిత్వంపై శ్రద్ధ చూపుతారు!



