త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lovers | ప్రేయ‌సి అలిగింద‌ని.. రైలు ప‌ట్టాల‌పై త‌ల‌పెట్టాడు..

Lovers | ప్రేమికుల (Lovers) మ‌ధ్య పోట్లాట‌లు, అల‌క‌లు, గిల్లీక‌జ్జాలు స‌హ‌జం. అవ‌న్నీ ఉంటేనే వారి మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. కానీ త‌న ప్రేయ‌సి అలిగింద‌ని.. ఓ ప్రియుడు త‌న త‌ల‌ను రైలు వ‌స్తుండ‌గా ప‌ట్టాల‌పై పెట్టాడు.

G

National | Published On Feb 2, 2026, 10.46 am IST

Lovers | ప్రేయ‌సి అలిగింద‌ని.. రైలు ప‌ట్టాల‌పై త‌ల‌పెట్టాడు..
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ప్రేమికుల (Lovers) మ‌ధ్య పోట్లాట‌లు, అల‌క‌లు, గిల్లీక‌జ్జాలు స‌హ‌జం. అవ‌న్నీ ఉంటేనే వారి మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. కానీ త‌న ప్రేయ‌సి అలిగింద‌ని.. ఓ ప్రియుడు త‌న త‌ల‌ను రైలు వ‌స్తుండ‌గా ప‌ట్టాల‌పై (Railway Track) పెట్టాడు. అయితే సిబ్బంది గ‌మ‌నించ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీకాకులం జిల్లా మెళియాపుట్టి మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, పార్వతీపురం ప్రాంతానికి చెందిన యువతి ప్రేమించుకుంటున్నారు. విజ‌య‌న‌గ‌రంలో డిగ్రీ అభ్య‌సిస్తుండ‌గానే ఇద్ద‌ర మ‌ధ్య ప్రేమ చిగురించింది. డిగ్రీ పూర్త‌వ‌డంతో ప్ర‌స్తుతం ఎవ‌రి ఊర్ల‌లో వాళ్లే ఉంటూ అప్పుడ‌ప్పుడూ క‌లుస్తున్నారు. అయితేత‌న ప్రేయ‌సిని చూడాల‌ని అనుకున్న అత‌డు.. త‌న‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌ని, టెక్క‌లికి రావాల‌ని చెప్పాడు.

దీంతో ప్రియుడికి ఏమైందోన‌న్న ఆందోళ‌న‌తో ఇంట్లో వారికి చెప్పకుండానే ఆ యువతి ఆదివారం టెక్కలికి వ‌చ్చేసింది. యువకుడిని చూసిన ఆమె క్షేమంగానే ఉన్నాడ‌ని ఊపిరిపీల్చుకుంది. అయితే త‌న‌కు అబద్ధం చెప్పినందుకు అలకబూనింది. ఎంత స‌ముదాయించిన‌ప్ప‌టికీ ఆమె విన‌లేదు. దీంతో అక్కడినుంచి వెళ్లిపోతే తనకు నిజంగానే ప్రమాదం జరుగుతుందని బెదిరిస్తూ.. యువకుడు రైలు పట్టాలపై త‌ల‌పెట్టాడు. అదే సమయంలో గుణుపురం వెళ్తున్న పాసింజరు రైలు వ‌స్తున్న‌ది. గ‌మ‌నించిన సిబ్బంది రైలును ఆపేశారు. ఇదంతా గ‌మ‌నిస్తున్న స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసుల ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఇద్దర్నీ స్టేషన్‌కు తరలించారు. తల్లిదండ్రులను పిలిపించి.. వారి స‌మ‌క్షంలో హెచ్చరించి ఇద్ద‌రిని పంపించారు.

Advertisement
Advertisement