RS Praveen Kumar | రేవంత్‌కు రెండు చోట్ల ఓటు.. ఏడాది పాటు జైలుకు పంపాల్సిందే : ఆర్ఎస్పీ
RS Praveen Kumar | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొడంగల్, కొండారెడ్డిపల్లిలో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొడంగల్, కొండారెడ్డిపల్లిలో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎన్నికల కమిషన్ నడిపేది ఎవరు? రేవంత్ రెడ్డి? సుదర్శన్ రెడ్డా? అని నిలదీశారు. కొడంగల్ ఎన్నిక రద్దు చేయాలి.. రేవంత్ రెడ్డిని ఏడాది పాటు జైలుకు పంపాలి. ఎన్నికల కమీషన్ వెంటనే కేసులు నమోదు చేయాలి అని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
మీనాక్షి నటరాజన్‌కు ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయమా? సాధారణ పౌరులు తప్పు చేస్తే ఒక న్యాయం, అధికారులు నాయకులు తప్పు చేస్తే వారికి ఒక న్యాయమా? ముఖ్యమంత్రే ఎలక్టోరల్ మాల్‌ప్రాక్టిస్‌కి పాల్పడ్డారు. రేవంత్ రెడ్డికి కొండారెడ్డిపల్లిలో ఒక ఓటు, కొడంగల్‌లో మరో ఓటు ఉంది. గత ఎన్నికల్లో కుటుంబ సమేతంగా కొడంగల్‌లో ఓటు వేశారు. రెప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం, సెక్షన్ 17 ప్రకారం ఎవరికి రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉండకూడదు. సెక్షన్ 18 వ్యక్తి ఒకే నియోజకవర్గంలో రెండు ఓట్లు ఉండద్దు. ఇలాంటి తప్పులు ఎవరైనా చేస్తే సెక్షన్ 31 ప్రకారం విచారణ జరపాలి, నేరం రుజువైతే ఒక ఏడాది జైలు. జరిమానా లేదా రెండు విధంచవచ్చు అని ఆర్ఎస్పీ తెలిపారు.
ఫ్యాక్ట్‌చెక్‌పై కేసు నమోదు చేయాలి
కొడంగల్‌లో, కొండారెడ్డిపల్లిలో రెండు చోట్ల ఓటు ఉన్నాయి. TES0274035 ఇదే ఎపిక్ నెంబర్‌తో ఉంది. సీరియల్ నెం. 974 కొడంగల్, సీరియల్ నెం. 601 కొండారెడ్డిపల్లి. ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉన్నారు. రేవంత్ రెడ్డి 31 సెక్షన్ ప్రకారం నేరస్థుడే. ఫ్యాక్ట్‌చెక్ అనే హ్యాండిల్ ఎలక్షన్ కమిషన్ స్థానంలో వివరణ ఇస్తుంది. అసలు ఫ్యాక్ట్‌చెక్ ఎక్కడిది? ఎందుకు అలా ఎన్నికల కమిషన్ కాకుండా ఫ్యాక్ట్‌చెక్ సీఎం ఆఫీస్ నుండి స్పందించింది? తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, ఆర్టికల్ 324 ప్రకారం, పీపుల్స్ రిప్రెజెంటేషన్ యాక్ట్ ప్రకారం వెంటనే కేసు నమోదు చేయాలి. అయితే ఎన్నికల కమిషన్ కాకుండా, ఫ్యాక్ట్‌చెక్ సంస్థ నుండి వివరణ ఇచ్చారు. తర్వాత రాత్రికి రాత్రే ఆ పోస్ట్ డిలీట్ చేశారు. ఫ్యాక్ట్‌చెక్‌పై కేసు నమోదు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.
మరి కొండారెడ్డిపల్లి ఓటు ఏమైంది?
నాగర్‌కర్నూల్ కలెక్టర్ నిన్న అచ్చంపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో రేవంత్ రెడ్డికి ఎలాంటి ఓటు లేదని చెప్పారు.. కానీ ఇప్పటికీ ఓటు ఉంది. 2023లో కొడంగల్‌లో అఫిడవిట్‌లో కొడంగల్ ఓటరునే అని చెప్పారు. మరి కొండారెడ్డిపల్లి ఓటు ఏమైంది? కొండారెడ్డిపల్లెలో ఓటు హక్కు ఎపుడు తొలగించారు? రేవంత్ రెడ్డి సంతకం చేశారా? ఓటు తొలగించే ముందు రేవంత్ రెడ్డికి నోటీసు ఇచ్చారా? ఫారం 8 ప్రకారం కొండారెడ్డిపల్లిలో ఓటు తొలిగించాలని రేవంత్ రెడ్డి ధరఖాస్తు చేసుకున్నారా? ఫారం 7 ఆధారంగా ఓటు ఎప్పుడు తొలగించారో జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ఫారం 7 మీద సంతకం చేయకుండా ఎలా ఓటు తొలగిస్తారు? లేదంటే.. జిల్లా కలెక్టర్ కూడా బీఎన్ఎస్ ప్రకారం విలువైన ఆధారాన్ని నాశనం చేసిన నేరం కింద నేరస్థులవుతారు. తెలంగాణలో ఎన్నికల కమిషన్ నడిపేది ఎవరు? రేవంత్ రెడ్డి? సుదర్శన్ రెడ్డా? సుదర్శన్ రెడ్డి సమాధానం చెప్పాలి. సుదర్శన్ రెడ్డి బదులు సీఎం ఆఫీస్ నుండి ఫ్యాక్ట్‌చెక్ ఎందుకు స్పందించింది? అని నిలదీశారు.
రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు?
ప్రకాష్ రాజ్ అనే సినీ నటుడు, చెన్నై, హైదరాబాద్‌లో ఓటు ఉందని 2019 లో కేసు పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు? ప్రధాన ఎన్నికల అధికారి వెంటనే పోలీసు కేసు నమోదు చేయాలి. రేవంత్ రెడ్డి రెండు ఓట్ల గురించి తెలియకుండా, ఫేక్ అఫిడవిట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలి.. తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం. రేవంత్ రెడ్డి పాలనలో సాఫ్ట్‌వేర్ ఆధారంగానే నేరాలు.. భూభారతిలో కూడా ఇలాంటి నేరమే జరిగింది. ఎస్ఐఆర్ నిష్పాక్షపాతంగా నడుపుతారని ఎలా నమ్మాలి సుదర్శన్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి చెప్తే ప్రధాన ఎన్నికల అధికారి బీఆర్ఎస్ ఓట్లు తొలగిస్తారనే అనుమానం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి, 2023 కొడంగల్ ఎన్నికల రద్దు చేయాలని కోరుతాం. కలెక్టర్ మీడియాను కూడా బెదిరిస్తున్నారు. తప్పుడు వార్తలు ప్రచురించద్దని బెదిరిస్తున్నారు.. దీన్ని ఖండిస్తున్నాం. తెలంగాణలో బెదిరింపుల పాలన నడుస్తుంది అని ఆర్ఎస్పీ మండిపడ్డారు.
కొడంగల్ ఎన్నిక రద్దు చేయాలని బీఆర్ఎస్ పోరాడుతుంది
ప్రకాష్ రాజ్‌కు ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఉండొద్దు. మీనాక్షి నటరాజన్‌కు రేవంత్ రెడ్డి వేరు వేరు న్యాయం ఉండద్దు. కొడంగల్ ఎన్నిక రద్దు చేయాలని బీఆర్ఎస్ పోరాడుతుంది. ప్రస్తుతం డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీ ఆధారంగా ఆటోమేటిక్‌గా రెండు ఓట్లు ఉంటే రద్దవుతాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
సంబంధిత వార్తలు

MP Renuka Chowdhury | బీఆర్ఎస్ పుంజుకుంటుంది.. ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు వైరల్
జులై 15, 2026

Tummala Nageshwar Rao | మరో 5 లక్షల మెట్రిక్ టన్నులకు వేర్ హౌసింగ్ సామర్థ్యం
జులై 15, 2026

Etala Rajender | మూసీ కంటే అధ్వాన్నంగా జవహర్‌నగర్ డంప్ యార్డ్.. రేవంత్ సర్కార్‌పై ఎంపీ ఈటల ఆగ్రహం
జులై 15, 2026
తాజావార్తలు
- ●LPG cylinder | ఇన్‌స్టామార్ట్ ద్వారా బుక్ చేసిన 10 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ.. దేశంలోనే తొలిసారి
- ●MP Renuka Chowdhury | బీఆర్ఎస్ పుంజుకుంటుంది.. ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు వైరల్
- ●Stock Markets | స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో మొదలైన అమ్మకాల ఒత్తిడి..
- ●Jana Nayagan | జన నాయగన్ వచేస్తున్నాడు.. ఈ నెల 23న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్..
- ●Tummala Nageshwar Rao | మరో 5 లక్షల మెట్రిక్ టన్నులకు వేర్ హౌసింగ్ సామర్థ్యం
- ●Etala Rajender | మూసీ కంటే అధ్వాన్నంగా జవహర్‌నగర్ డంప్ యార్డ్.. రేవంత్ సర్కార్‌పై ఎంపీ ఈటల ఆగ్రహం

LPG cylinder | ఇన్‌స్టామార్ట్ ద్వారా బుక్ చేసిన 10 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ.. దేశంలోనే తొలిసారి

MP Renuka Chowdhury | బీఆర్ఎస్ పుంజుకుంటుంది.. ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు వైరల్

Stock Markets | స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో మొదలైన అమ్మకాల ఒత్తిడి..

Jana Nayagan | జన నాయగన్ వచేస్తున్నాడు.. ఈ నెల 23న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్..



