త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Renuka Chowdhury | బీఆర్ఎస్ పుంజుకుంటుంది.. ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు వైరల్

MP Renuka Chowdhury | రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌద‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంద‌ని ఆమె వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Jul 15, 2026, 3.52 pm IST

MP Renuka Chowdhury | బీఆర్ఎస్ పుంజుకుంటుంది.. ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు వైరల్
Advertisement

MP Renuka Chowdhury | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌద‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంద‌ని ఆమె వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ కూడా వాస‌న చూస్తుంద‌ని రేణుకా చౌద‌రి వ్యాఖ్యానించారు. అయితే ఆమె లిఫ్ట్‌లో ప్ర‌యాణిస్తూ.. పార్టీ నేత‌ల‌తో ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. రేణుకా చౌద‌రి వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

రేణుకా చౌద‌రి వ్యాఖ్య‌ల‌పై ఓ నెటిజ‌న్ ఈ విధంగా స్పందించారు. పుంజుకోవడం కాదు.మా పాత కరీంనగర్ జిల్లాలో అయితే సునామీ రాబోతుంది ఎన్నికలు ఎప్పుడు జరిగిన అని ఓ నెటిజ‌న్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement