Om Birla | అవిశ్వాసతీర్మానం నోటీసులో లోపాలు.. స్పీకర్‌కు తిరస్కరించే అవకాశం ఉన్నా..
Om Birla | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)ను పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష ఎంపీలు (Opposition MPs) అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ నోటీసును తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ స్పీకర్ ఓం బిర్లా అలా చేయలేదని తెలిసింది.
Om Birla | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)ను పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష ఎంపీలు (Opposition MPs) అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ నోటీసును తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ స్పీకర్ ఓం బిర్లా అలా చేయలేదని తెలిసింది. పైగా నోటీసుల్లో ఉన్న లోపాలను సరిచేసేలా సెక్రటేరియట్ అధికారులను ఓం బిర్లా ఆదేశించినట్లు సమాచారం.
ఓం బిర్లాను స్పీకర్ పదవి నుంచి తొలగించాలంటూ (No Confidence Motion Against Lok Sabha Speaker) విపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఆ నోటీసులను పరిశీలించిన అధికారులు అందులో సాంకేతిక, విధానపరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఫార్మాట్‌లో ఈ నోటీసు లేదని అధికారులు తెలిపారు. కొన్ని సందర్భాలను ప్రతిపక్షనేతలు అందులో పదేపదే ప్రస్తావించినట్లు తెలిపారు.
సాధారణంగా ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు ఆ నోటీసును తిరస్కరించే అవకాశం ఉంటుంది. కానీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాత్రం ఈ విషయంలో భిన్నంగా స్పందించారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ తదుపరి చర్యల కోసం స్పీకర్ సానుకూలంగా స్పందించారు. అందులోని లోపాలను సరిచేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో సవరించిన నోటీసు అందిన తర్వాత.. నిబంధనల ప్రకారం వాటిని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. ఇక ఈ నోటీసును రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు స్వీకరించే అవకాశం ఉంది.
ఓం బిర్లా కీలక నిర్ణయం..
ఇదిలా ఉండగా.. స్పీకర్‌ను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక..
మే 19, 2026

Kanimozhi | కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. సభలో వారిపక్కన కూర్చోం.. ఓంబిర్లాకు డీఎంకే లేఖ
మే 8, 2026

Women Reservation | మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రధాని మోదీకి లేఖ రాయనున్న ప్రతిపక్షాలు..!
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



