Lok Sabha | లోక్‌సభలో అనూహ్య పరిణామం.. ప్రధాని ప్రసంగం లేకుండానే తీర్మానానికి ఆమోదం
Lok Sabha | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగంపై (Presidents Address) ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది.
Lok Sabha | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగంపై (Presidents Address) ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రసంగం లేకుండానే దీనికి ఆమోదం లభించడం గమనార్హం. సభ ప్రారంభమైన వెంటనే ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
కాగా, లోక్‌సభలో విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ సహా పలు అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పట్టుబడుతున్నారు. ఈ మేరకు సభలో గందరగోళం సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. నిన్న లోక్‌సభలో ప్రధాని ప్రసంగించాల్సి ఉండగా.. వారి నిరసనలతో సభను వాయిదా వేశారు. ఇవాళ ఉదయం కూడా లోక్‌సభలో నిరసనలు కొనసాగాయి. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. వారి నిరసనల మధ్యే ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేశారు. ఇక ఇవాళ రాజ్యసభలో ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఖర్గే vs నడ్డా
మరోవైపు రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య మాటల యుద్ధం సాగింది. లోక్‌సభలో జరిగిన గందరగోళాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఎత్తిచూపారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. లోక్‌సభ కార్యకలాపాలను రాజ్యసభలో చర్చించకూడదన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలంటూ వ్యాఖ్యానించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






