త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HiLITE Group | ఉద్యోగుల‌కు రూ.20 కోట్ల విలువైన కార్ల‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ

HiLITE Group | కేర‌ళ (Kerala) కోజికోడ్ (Kozhikode)కు చెందిన ఓ సంస్థ త‌న ఉద్యోగుల‌కు (employees) ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్ల‌ను బ‌హుమ‌తిగా (gifts cars) అందించింది.

D

National | Published On Feb 18, 2026, 5.01 pm IST

HiLITE Group | ఉద్యోగుల‌కు రూ.20 కోట్ల విలువైన కార్ల‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ
Advertisement

HiLITE Group | కేర‌ళ (Kerala) కోజికోడ్ (Kozhikode)కు చెందిన ఓ సంస్థ త‌న ఉద్యోగుల‌కు (employees) ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్ల‌ను బ‌హుమ‌తిగా (gifts cars) అందించింది. సంస్థ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా రూ.20 కోట్లు ఖ‌ర్చుపెట్టి 47 మంది ఉద్యోగుల‌కు కార్ల‌ను గిఫ్ట్స్‌గా ఇచ్చింది.

హైలైట్ గ్రూప్ (HiLITE Group)ను 1996లో స్థాపించారు. ఈ సంస్థ రాష్ట్రంలో రిటైల్ స్పేస్ రంగంలో అగ్ర‌గామిగా కొన‌సాగుతోంది. ఇటీవ‌లే సంస్థ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా కాలిక‌ట్‌లో కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ స్థాపించిన‌ప్ప‌టి నుంచి కంపెనీ ఎదుగుద‌ల‌కు కృషి చేసి అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన 47 మంది ఉద్యోగుల‌కు ల‌గ్జ‌రీ కార్ల‌ను బ‌హుమ‌తిగా అందించింది. రూ.20 కోట్ల విలువైన 47 ల‌గ్జ‌రీ కార్ల‌ను ఉద్యోగుల‌కు గిఫ్ట్‌గా ఇచ్చింది.

ఉద్యోగుల‌కు బ‌హుమ‌తిగా అందించిన కార్ల‌లో ల్యాండ్ రోవ‌ర్‌, డిఫెండ‌ర్‌, రేంజ్ రోవ‌ర్‌, బెంజ్‌, బీఎమ్ డ‌బ్ల్యూ, ఆడీ, స్కోడా, టాటా హారియ‌ర్‌, కియా సెల్టోస్‌, హ్యుందాయ్ క్రెటా వంటి ఖ‌రీదైన మోడల్స్ ఉన్నాయి. దీంతోపాటుగా 2030 నాటికి సంస్థను మరింత విస్తరించి 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని హైలైట్‌ గ్రూప్‌ యాజమాన్యం ప్రకటించింది. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువురు హైలైట్ గ్రూప్ త‌న ఉద్యోగుల ప‌ట్ల చూపిన ఉదార‌త‌ను కొనియాడుతున్నారు. ఉద్యోగుల కృషిని గుర్తించి వారిని ఈ విధంగా గౌర‌వించ‌డం గొప్ప విష‌యం అంటూ చెప్పుకుంటున్నారు. కాగా, గ‌తంలో చెన్నై, హ‌ర్యానాకు చెందిన ప‌లు సంస్థ‌లు కూడా దీపావ‌ళి కానుక‌గా ఉద్యోగుల‌కు కార్ల‌ను బ‌హుమ‌తిగా అందించి ప్ర‌శంస‌లు పొందిన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement