త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalwakuntla Kavitha | అనుముల కాదు! ఆయ‌న‌ ఆంధ్రా రేవంత్‌రెడ్డి.. అందుకే బ్రాహ్మ‌ణ‌ పరిషత్ ఛైర్మన్ ప‌ద‌వి శ్రీనివాసరావుకు క‌ట్ట‌బెట్టిండు

Kalwakuntla Kavitha | రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదని.. ఆయ‌న‌ ఆంధ్రా రేవంత్ రెడ్డి అని తెలంగాణ రక్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆరోపించారు. అందుకే బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్ చైర్మ‌న్ ప‌ద‌విని బ‌స‌వ‌రాజు శ్రీ‌నివాస‌రావుకు క‌ట్ట‌బెట్టిండ‌ని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Aug 27, 2026, 4.17 pm IST

Kalwakuntla Kavitha | అనుముల కాదు! ఆయ‌న‌ ఆంధ్రా రేవంత్‌రెడ్డి.. అందుకే బ్రాహ్మ‌ణ‌ పరిషత్ ఛైర్మన్ ప‌ద‌వి శ్రీనివాసరావుకు క‌ట్ట‌బెట్టిండు
Advertisement
  • చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వులు తెలంగాణ వాళ్ల‌కే ఇవ్వాలి
  • యాదాద్రి గుడి బోర్డులో కూడా ఆంధ్రావాళ్లను తొలగించాలి
  • ఈ ముఖ్యమంత్రికి ఇప్పటికైనా తెలంగాణ సోయి రావాాలి.. లేదంటే ఆంధ్రా రేవంత్ రెడ్డి అనే పిలుస్తా
  • తెలంగాణ రక్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత డిమాండ్‌

త్రినేత్ర‌.న్యూస్‌: రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదని.. ఆయ‌న‌ ఆంధ్రా రేవంత్ రెడ్డి అని తెలంగాణ రక్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆరోపించారు. అందుకే బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్ చైర్మ‌న్ ప‌ద‌విని బ‌స‌వ‌రాజు శ్రీ‌నివాస‌రావుకు క‌ట్ట‌బెట్టిండ‌ని విమ‌ర్శించారు. బ్రాహ్మణ పరిషత్‌లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు ఆంధ్రా వాళ్లకు ఇచ్చారని.. వెంట‌నే వారిని తొల‌గించి తెలంగాణ వాళ్ల‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణలో బ్రాహ్మ‌ణ మేధావులు లేరా? అని ప్ర‌శ్నించారు.

ఆంధ్రా రౌడీలకు అడ్డాగా మారింది..

పొలిటికల్ పదవులు కచ్చితంగా తెలంగాణ వాళ్లకే ఇవ్వాలి. ఇప్పుడున్న బ్రహ్మణ పరిషత్ ఛైర్మన్ బసవరాజు శ్రీనివాసరావు పచ్చి తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. పేద బ్రహ్మణులకు మేలు చేయాల్సిన తెలంగాణ బ్రహ్మణ పరిషత్ ఆంధ్రా రౌడీలకు అడ్డాగా మారింది
దళిత మహిళలను, తెలంగాణ వాళ్లను బసవరాజు శ్రీనివాసరావు ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. వెంటనే ఆంధ్రావాళ్లకు ఇచ్చిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను తొలగించి తెలంగాణ వాళ్లకు ఇవ్వాలి.

ఆంధ్రా హీరో భార్యను మెంబ‌ర్ చేశారు..

ఆయన విదేశీ పర్యటనను అడ్డుకుంటే ముఖ్యమంత్రికి తెలంగాణ గుర్తు వచ్చింది. కానీ రెడ్ కో ఛైర్మన్, ప్రిన్సిపల్ సెక్రటరీ సహా ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఆంధ్రావాళ్ల పెత్తనమే కదా ఉన్నది. తెలంగాణ భక్తుల పైసలతో కట్టిన యాదాద్రి గుడిలో మెంబర్‌గా ఆంధ్రా హీరో భార్యకు అవకాశం కల్పించారు. తిరుపతి బోర్డులో మనవాళ్లకు అవకాశం కల్పించటమంటే అక్కడ మనవాళ్ల పైసలు కూడా ఉంటాయి.

బయోకాన్‌లో తెలుగు మాట్లాడినందుకు 200 మందిని తీసేస్తే ముఖ్యమంత్రి మాట్లాడడు. ఆంధ్రావాళ్లు సహా ఇతర కంపెనీలలో బాత్‌రూమ్‌లు కడిగేవాళ్లను కూడా తెలంగాణ వాళ్లను పెట్టుకోవటం లేదు. నారాయణ కాలేజ్‌లో సంవత్సరం మధ్యలో చాలా మందిని తొలగించారు. వారికి ఇప్పుడు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఆంధ్రా వాళ్ల ఏజెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణలో పాలన నడుస్తోంది. అందుకే ఈ ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్లకు అన్యాయం జరిగితే మాట్లాడటం లేదు.

ఈ ముఖ్యమంత్రికి ఇప్పటికైనా తెలంగాణ సోయి రావాలి. లేదంటే ఆయన ఎప్పుడు కనిపించినా సరే ఆంధ్రా రేవంత్ రెడ్డి అనే పిలుస్తా. ఈ ముఖ్యమంత్రికి బీజేపీ, ఆంధ్రావాళ్లతో లాలూచీ ఉంది. అందుకే తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోవటం లేదు. కృష్ణా నీళ్లను ఆంధ్రావాళ్లు పట్టుకొని పోయినా సరే ఆయన పట్టించుకోవటం లేదు. నిజంగా ఆయనకు తెలంగాణ సోయి ఉంటే బ్రాహ్మణ పరిషత్‌లో ఆంధ్రావాళ్లను తొలగించాలి. యాదాద్రి గుడి బోర్డులో కూడా ఆంధ్రావాళ్లను తొలగించాలి.

హరీశ్ రావుపై క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మాజీ మంత్రి హరీశ్ రావుతో లండన్‌లో ఎలాంటి ఒప్పందం జరిగి ఉండకపోతే గత ప్రభుత్వంలో మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని సొంత డెయిరీకి లాభం చేకూర్చిన హరీశ్ రావుపై క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ రంగంలోని డెయిరీని కాదని తన సొంత డెయిరీ ద్వారా కార్పొరేట్ కాలేజీలు, సంస్థలు, హాస్పిటళ్లకు పాలు సరఫరా చేసి 8 ఏళ్లలో వందల కోట్ల వ్యాపారం చేయడం క్విడ్ ప్రో కో కాదా?

హరీశ్ రావుతో మీకు లాలూచీ లేకపోతే వెంటనే 500 మంది విద్యార్థులు పైగా ఉన్న ప్రతి విద్యా సంస్థలకు ప్రైవేటు డెయిరీల ద్వారా కాకుండా ప్రభుత్వ, సొసైటీల ఆధ్వర్యంలో నడిచే డెయిరీల నుంచి పాల సరఫరా చేసే విధంగా జీవో ఇవ్వాలి అని క‌విత డిమాండ్ చేశారు.

ఒడిశా అమ్మాయిని చంపితే ఎఫ్ఐఆర్‌లో తండ్రి పేరు లేదు.. పోలీసులు సిగ్గుప‌డాలి..

ఇనార్బిట్ మాల్ వద్ద ఓ ఆంధ్రా ఎంపీ కొడుకు ఆరు కోట్ల కారు వేసుకొని ఒడిశాకు చెందిన 25 ఏళ్ల అమ్మాయిని కారుతో గుద్ది చంపాడు. ఆమెను చంపితే పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్‌లో తండ్రి పేరు లేదు. ఈ కేసులో ఆల్కహాల్ కంటెంట్ లేదని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్‌లో అన్ని ఖాళీలే ఉన్నాయి. వేరే కేసులో కూడా ఇలాగే ఎఫ్ఐఆర్ వేస్తారా? ఇలా ఎఫ్ఐఆర్ రాసినందుకు పోలీసులు సిగ్గుపడాలి. ముఖ్యమంత్రి తన విదేశీ పర్యటనను అడ్డుకుంటే 48 నిమిషాలు ప్రెస్ మీట్ పెడతాడు. కానీ ఒక్క క్షణం కూడా ఎంపీ గారి కొడుకు చేసిన యాక్సిడెంట్ గురించి మాట్లాడడు.

Advertisement
Advertisement