TG Govt | పెట్రోల్, డీజిల్ ఆటోలకు చెక్.. ఈవీలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో సర్కారు కొత్త పథకం
TG Govt | నగరంలోని పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్–2026’కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద 18,766 ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనున్నారు. ఇందుకోసం రూ.200 కోట్లను కేటాయించారు.
TG Govt | నగరంలోని పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్–2026’కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద 18,766 ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనున్నారు. ఇందుకోసం రూ.200 కోట్లను కేటాయించారు. అర్హత ఉన్న ఆటో యజమానులకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆటో ఛాసిస్‌ను కొనసాగిస్తూ ఆమోదిత ఎలక్ట్రిక్ కిట్‌ను అమర్చుకుని వాహనాన్ని విద్యుత్ ఆటోగా మార్చుకునే అవకాశం ఉంటుంది. లేదంటే పాత ఆటోను అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసుకునే వీలు కల్పించనున్నారు.
11,254 డీజిల్.. 7,512 పెట్రోల్
క్యూర్ అర్బన్ రీజియన్ పరిధిలో చెల్లుబాటయ్యే రిజిస్ట్రేషన్ ఉన్న 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ప్రభుత్వం గుర్తించింది. వీటిలో 11,254 డీజిల్, 7,512 పెట్రోల్ ఆటోలు ఉన్నాయి. వీటిని దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనున్నారు. ఆటోను ఎలక్ట్రిక్‌గా మార్చుకునే వారికి అనుమతించిన కిట్, దాని అమరిక, అవసరమైన పరికరాల ఖర్చు కోసం గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు సాయం అందుతుంది. వాస్తవ వ్యయం అంతకంటే తక్కువగా ఉంటే ఆ మొత్తానికే పరిమితం చేస్తారు. ఫిక్స్‌డ్ బ్యాటరీ లేదా మార్చుకునే బ్యాటరీ విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. పాత ఆటోను అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీవీలర్ కొనుగోలు చేసేవారికి రూ.1.50 లక్షల స్థిర సబ్సిడీ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన డీలర్లు వాహనం ఆన్‌రోడ్ ధరలోనే ఈ మొత్తాన్ని తగ్గించి విక్రయించే విధానం అమలు చేయనున్నారు.
నాలుగు శాఖల నుంచి రూ.50 కోట్ల చొప్పున
ఈ పథకానికి కేటాయించిన రూ.200 కోట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు రూ.50 కోట్ల చొప్పున సమకూర్చనున్నాయి. సామాజిక వర్గంతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ఆటో యజమానులకు పథకం వర్తించేలా నిబంధనలు రూపొందించారు. పథకం అమలును పర్యవేక్షించేందుకు మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లో వాహన కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ఆటో డ్రైవర్లపై పెట్రోల్, డీజిల్ ఖర్చు భారాన్ని తగ్గించడం పథకం ప్రధాన ఉద్దేశం. నగర ప్రజా రవాణాలో ఆటోరిక్షాలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి
ఆగస్టు 27, 2026

Hyderabad girl goes missing in Nepal floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు
ఆగస్టు 27, 2026

CP Sajjanar | నకిలీ వైద్యులతో తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరించిన హైదరాబాద్ పోలీసులు..!
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●Kalwakuntla Kavitha | అనుముల కాదు! ఆయన ఆంధ్రా రేవంత్‌రెడ్డి.. అందుకే బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్ పదవి శ్రీనివాసరావుకు కట్టబెట్టిండు
- ●Ananya Panday | ప్రియుడితో బ్రేకప్ - రెండేళ్ల ప్రేమ బంధానికి లైగర్ హీరోయిన్ గుడ్‌బై
- ●PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి
- ●Nepal Flash Floods | నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు : విదేశాంగ శాఖ
- ●Gold Import Duty | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్..? బంగారంపై సుంకాన్ని తగ్గించే యోచనలో కేంద్రం..?
- ●Hyderabad girl goes missing in Nepal floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు

Kalwakuntla Kavitha | అనుముల కాదు! ఆయన ఆంధ్రా రేవంత్‌రెడ్డి.. అందుకే బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్ పదవి శ్రీనివాసరావుకు కట్టబెట్టిండు

Ananya Panday | ప్రియుడితో బ్రేకప్ - రెండేళ్ల ప్రేమ బంధానికి లైగర్ హీరోయిన్ గుడ్‌బై

PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి

Nepal Flash Floods | నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు : విదేశాంగ శాఖ



