త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kashmir | ఖ‌మేనీ మృతి.. జ‌మ్మూ క‌శ్మీర్‌లో నిర‌స‌న‌లు..

Kashmir | అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం క‌మాండ్ ఖ‌మేనీ మృతి చెందారు. దాంతో జ‌మ్మూ క‌శ్మీర్‌లోని ప‌లు ప్రాంతాల్లో నిర‌స‌న‌న‌లు చెల‌రేగాయి. ముఖ్యంగా షియా ప్రాబ‌ల్యం ఉన్న ప్రాంతాల్లో వంద‌లాది మంది వీధుల్లోకి వ‌చ్చార‌ని అధికారులు తెలిపారు.

P

National | Published On Mar 1, 2026, 2.18 pm IST

Kashmir | ఖ‌మేనీ మృతి.. జ‌మ్మూ క‌శ్మీర్‌లో నిర‌స‌న‌లు..
Advertisement

Kashmir | అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం క‌మాండ్ ఖ‌మేనీ మృతి చెందారు. దాంతో జ‌మ్మూ క‌శ్మీర్‌లోని ప‌లు ప్రాంతాల్లో నిర‌స‌న‌న‌లు చెల‌రేగాయి. ముఖ్యంగా షియా ప్రాబ‌ల్యం ఉన్న ప్రాంతాల్లో వంద‌లాది మంది వీధుల్లోకి వ‌చ్చార‌ని అధికారులు తెలిపారు. నిరసనకారులు అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరాన్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ దాడిని ఖండించారు. త‌మ ప్రియ‌మైన నేత ఖ‌మేనీ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారంటూ ఓ నిర‌స‌న‌కారుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఖ‌మేనీ చిత్రాలతో, ఇరాన్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ బ్యాన‌ర్లు, న‌ల్ల జెండాలో నిర‌స‌నల్లో పాల్గొన్నారు. విప్లవాత్మక నేత ఖమేనీ త‌మ‌తో లేడ‌ని తెలిసి చాలా బాధ‌ప‌డ్డామ‌ని ఓ నిర‌స‌నకారుడు వాపోయారు. శ్రీనగర్‌లోని షియా ముస్లిం సమాజానికి, ఖమేనీ కేవలం ఒక విదేశీ రాజకీయ నాయకుడు కాద‌న్నారు. ఇదిలా ఉండ‌గా.. ఖ‌మేనీ మృతికి జ‌మ్మూ క‌శ్మీర్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ సైతం సంతాపం ప్ర‌క‌టించింది. పార్టీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా నేతృత్వంలోని కాంగ్రెస్ నాయకులు ఈ దాడిని అమానవీయ‌, పిరిపంద చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. మ‌రో వైపు ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా సంయ‌మ‌నం పాటించాల‌ని కోరారు. ప్ర‌భుత్వం ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తోంద‌న్నారు. ఇరాన్‌లోని జమ్మూ క‌శ్మీర్ వాసులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రత విష‌యంలో విదేశాంగ మంత్రిత్వ‌శాఖ‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు వివ‌రించారు.

Advertisement
Advertisement