త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala Assembly | అసెంబ్లీని కుదిపేసిన శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప బంగారం వ్య‌వ‌హారం..! ప్ర‌తిప‌క్షాల‌పై సీఎం ఫైర్‌

Kerala Assembly | శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి ఆల‌యంలో బంగారం చోరీ వ్య‌వ‌హారం కేర‌ళ అసెంబ్లీని కుదిపేసింది. అసెంబ్లీలో యూడీఎఫ్ మంగ‌ళ‌వారం నిర‌స‌న‌కు దిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)పై ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తీవ్ర ఒత్తిడి తెస్తోందని యూడీఎఫ్ ఆరోపించింది.

P

National | Published On Feb 3, 2026, 4.05 pm IST

Kerala Assembly | అసెంబ్లీని కుదిపేసిన శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప బంగారం వ్య‌వ‌హారం..! ప్ర‌తిప‌క్షాల‌పై సీఎం ఫైర్‌
Advertisement

Kerala Assembly | శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి ఆల‌యంలో బంగారం చోరీ వ్య‌వ‌హారం కేర‌ళ అసెంబ్లీని కుదిపేసింది. అసెంబ్లీలో యూడీఎఫ్ మంగ‌ళ‌వారం నిర‌స‌న‌కు దిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)పై ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తీవ్ర ఒత్తిడి తెస్తోందని యూడీఎఫ్ ఆరోపించింది. కుంభ‌కోణానికి బాధ్య‌త వ‌హిస్తూ అప్ప‌టి దేవాదాయ‌శాఖ మంత్రి రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్ష‌నేత వీడీ స‌తీశ‌న్ డిమాండ్ చేశారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నిరసనను ఆయన ఖండనీయం మరియు దురదృష్టకరం అని అభివర్ణించారు. శబరిమల ఆలయం నుండి బంగారం అదృశ్యంపై జరుగుతున్న దర్యాప్తును కేరళ హైకోర్టు యొక్క విస్తృత ధర్మాసనం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ధర్మాసనం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పనితీరును ప్రశంసించిందని ఆయన తెలిపారు. యూడీఎఫ్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. సీఎంవో జోక్యం వ‌ల్లే గ‌డువులోగా సిట్ చార్జిషీట్ దాఖ‌లు చేయ‌లేద‌ని.. దాంతో నిందితుల‌కు బోయిల్ ల‌భించింద‌ని ఆరోపించారు. అయ్యప్ప స్వామి సొమ్మును లూటీ చేసిన వారిని ప్ర‌భుత్వం వెన‌కేసుకొని వ‌స్తుందంటూ ప్ర‌తిప‌క్ష నేత‌లు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు.

అయితే, ప్ర‌తిప‌క్షం యూడీఎఫ్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా ఓ న్యాయ‌మూర్తి ద‌ర్యాప్తును విమ‌ర్శించార‌ని.. దాంతో మొత్తం ద‌ర్యాప్తుతో విభేదించిన‌ట్లుగా భావించొద్ద‌న్నారు. హైకోర్టు విస్తృత ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షానికి చెంపపెట్టు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుగా గందరగోళం సృష్టించి, ఆ తర్వాత స్పీకర్ పోడియంపైకి ఎక్కార‌ని, భ‌ద్ర‌తా సిబ్బందిపై దాడి చేశార‌న్నారు. సభ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని విజ‌య‌న్ పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌ల‌ను ప్ర‌జ‌లు, మీడియా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అందుకే ఉద్దేశ‌పూర్వ‌కంగా స‌భ‌లో గొడ‌వ చేస్తున్నార‌ని ఆరోపించారు. ఎమ్మెల్యేల హింసాత్మక చర్యలను సమర్థించిన ప్రతిపక్ష నేత వీడీ స‌తీశ‌న్‌పై మండిప‌డ్డారు.

కేర‌ళ‌లోని ప్ర‌ముఖ క్షేత్ర‌మైన అయ్య‌ప్ప దేవాల‌యం గ‌ర్భాల‌యం బంగారు తాప‌డాలకు సంబంధించిన బంగారం అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించిన కేసుపై ప్ర‌స్తుతం సిట్ విచార‌ణ జ‌రుపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసులో 12 మందిని సిట్ అరెస్టు చేసింది. ఇందులో ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇందులో ప్ర‌ధాన నిందితుడు ఉన్ని కృష్ణ‌న్ పొట్టికి సైతం బెయిల్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే కేర‌ళ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాగానే ప్ర‌తిప‌క్ష యూడీఎఫ్ నిర‌స‌న‌కు దిగింది. సీఎం కార్యాల‌యంపై గుప్పించింది. ఆ ఆరోప‌ణ‌ల‌ను సీఎం ఖండించారు. ద‌ర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement