Kerala | సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి..! కేసు నమోదు చేసిన పోలీసులు
Kerala | కేరళలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కే రేష్మ (24) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం కాసరగోడ్ జిల్లాలోని ఉలియతడ్క ప్రాంతంలోని ఆమె అద్దె గృహంలో చనిపోయి కనిపించింది.
Kerala | కేరళలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కే రేష్మ (24) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం కాసరగోడ్ జిల్లాలోని ఉలియతడ్క ప్రాంతంలోని ఆమె అద్దె గృహంలో చనిపోయి కనిపించింది. రేష్మ తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని మృతిచెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రేష్మ సోషల్ మీడియాలో ‘చిన్ను పప్పు’ పేరుతో గుర్తింపు పొందింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుందని.. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. ఇటీవల ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేష్మ మృతదేహం పోస్టుమార్టానికి తరలించారు. ఆమె స్నేహితులను విచారిస్తున్నట్లు, మొబైల్ ఫోన్ కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు వివరించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






