Monsoon | నైరుతి రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం.. రాష్ట్రంపై ఎల్‌నినో ఎఫెక్ట్..!
Monsoon | కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశంపై ఈసారి అనిశ్చితి నెలకొంది. సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకే రుతుపవనాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు బలహీనంగా ఉండడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
Monsoon | కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశంపై ఈసారి అనిశ్చితి నెలకొంది. సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకే రుతుపవనాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు బలహీనంగా ఉండడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. తొలుత మే 26న కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని అంచనా వేసింది. తాజాగా నాలుగు రోజులు ఆలస్యంగా రావొచ్చని పేర్కొంది. ఎప్పుడు కేరళను తాకుతాయన్నది స్పష్టంగా చెప్పలేదు. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ముందుకు సాగే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని మాత్రమే పేర్కొంది. ఈ అంశంపై స్పందించిన ఐఎండీ వర్గాలు స్పందించాయి. ప్రస్తుతం శాఖ అంచనాల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు.
పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నామని, అవసరమైతే తాజా సమాచారం వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు, కొందరు నిపుణులు మాత్రం రుతుపవనాల ప్రవేశం సాధారణ తేదీ కంటే ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్కైమెట్ అధ్యక్షుడు జీపీ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం కేరళలో కనిపిస్తున్న వర్షాలు సాధారణ రుతుపవనాలకు సంబంధించినవి కావని.. ప్రీ మాన్సున్ వర్షాల తరహాలో ఉన్నాయన్నారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫెరిక్ సైన్స్ పరిశోధకుడు అక్షయ్ దేవరస్ మాట్లాడుతూ.. కేవలం వర్షపాతం ఆధారంగా మాన్సూన్ ప్రవేశాన్ని ప్రకటించలేమన్నారు. మాన్సూన్ అధికారికంగా ప్రారంభమైందని చెప్పాలంటే మూడు కీలక అంశాలు అవసరమన్నారు. సరిపడా వర్షాపాతం, లోతైన గాలులు, అనుకూలంగా మేఘాల నిర్మాణం ఉండాలన్నారు. మే 24న కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసినా, సముద్రంపై రుతుపవన గాలులు ఇంకా బలపడలేదన్నారు.
మరో వాతావరణ నిపుణుడు అభిజిత్ మోదక్ మాట్లాడుతూ.. తాజా వాతావరణ నమూనాల ప్రకారం.. కేరళలో మాన్సూన్ ప్రవేశంపై ఇంకా స్పష్టత లేదన్నారు. తక్కువ ఎత్తులో వీచే పశ్చిమ గాలులు ఇంకా క్రమబద్ధంగా లేవని, అరేబియా సముద్రంలో ఏర్పడిన పైస్థాయి వాతావరణ చలనం కేరళ తీరానికి దూరంగా కదులుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జూన్ ఒకటిన లేదంటే రెండు రోజుల ఆలస్యంగా కేరళను తాకే అవకాశం ఉందన్నారు. సాధారణంగా ప్రతి ఏటా జూన్ ఒకటిన కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్ 5 నుంచి 10 మధ్య ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఎల్‌నినో ప్రభావం కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో లోటు వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CP Sajjanar | బక్రీద్ వేళ నకిలీ యాప్‌లతో మోసాలు.. వ్యాపారులను హెచ్చరించిన సీపీ సజ్జనార్
మే 26, 2026

Harbeer Singh | డ్రగ్స్ రాకెట్లో పంజాబీ సింగర్.. హర్బీర్ సింగ్ సోహైల్‌ను అరెస్టు చేసిన పోలీసులు..!
మే 26, 2026

Garima Agrawal | త్వరితగతిన కొనుగోళ్ళు పూర్తయ్యేలా చూడాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
మే 26, 2026
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?



