త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arvind Kejriwal | విచార‌ణ‌లో పాల్గొన‌ను..! ఢిల్లీ హైకోర్టు న్యాయ‌మూర్తికి కేజ్రీవాల్ సంచ‌ల‌న లేఖ‌..!

rvind Kejriwal | ఢిల్లీ హైకోర్టులో సీబీఐ లిక్కర్ పాలసీ కేసు విచారణలో ఇకపై పాల్గొనబోనని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. న్యాయపరమైన నిష్పక్షపాతంపై నమ్మకం కోల్పోయానని, గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు.

P

National | Published On Apr 27, 2026, 3.31 pm IST

Arvind Kejriwal | విచార‌ణ‌లో పాల్గొన‌ను..! ఢిల్లీ హైకోర్టు న్యాయ‌మూర్తికి కేజ్రీవాల్ సంచ‌ల‌న లేఖ‌..!
Advertisement

Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న సీబీఐ లిక్కర్ పాలసీ కేసు విచారణలో పాల్గొన‌బోన‌ని ప్ర‌క‌టించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వ‌ర‌ణ‌కాంత శ‌ర్మ‌కు లేఖ రాశారు. విచారణలో నిష్పక్షపాతత్వంపై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌న్నారు. న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, అయితే న్యాయం జరగడమే కాదు, అది జరిగిందని ప్రజలకు కనిపించాల‌నే ప్రాథమిక సూత్రం ఈ కేసులో పాటించ‌డం లేద‌ని ఆరోపించారు. ఈ నిర్ణయం కోపంతో గానీ, కోర్టుపై అవమాన భావంతో గానీ తీసుకోలేదని, ప్రజల విశ్వాసాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తీసుకున్న చర్యగా పేర్కొన్నారు. ఇక‌పై తాను విచార‌ణ‌నో పాల్గొన‌బోన‌ని.. దాని వ‌ల్ల త‌న చ‌ట్ట‌ప‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌న్నారు. ఆ ప‌రిణామాల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాన‌న్నారు. ఇదే గాంధీజీ చెప్పిన స‌త్యాగ్ర‌హ మార్గ‌మ‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల్లో అనుమానాలు..

ఈ కేసులో ట్రయల్ కోర్టు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌తో ప‌లువురికి అనుకూలంగా ఇచ్చిన తీర్పును సీబీఐ హైకోర్టులో రివిజ‌న్ పిటిష‌న్లు దాఖ‌లు చేసింది. ఆయా పిటిష‌న్ల‌ను జ‌స్టిస్ స్వ‌ర‌ణ కాంత శ‌ర్మ విచారిస్తున్నారు. ఇప్ప‌టికే న్యాయ‌మూర్తిని కేసు విచార‌ణ నుంచి త‌ప్పుకోవాల‌ని కేజ్రీవాల్ కోర‌గా తోసిపుచ్చారు. ఆదేశాల్లో ఉప‌యోగించిన భాష వ్య‌క్తిగ‌త దాడిగా భావించిన‌ట్లు అనిపించింద‌ని, ఈ పరిస్థితుల్లో నిష్పక్షపాత విచారణ జరుగుతుందనే నమ్మకం కలగడం కష్టమన్నారు. న్యాయమూర్తి కుటుంబీకులు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా పని చేస్తున్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. సొలిసిటర్ జనరల్ ద్వారా వారికి కేసులు కేటాయిస్తున్నార‌ని, ఇదే కేసులో సీబీఐ తరఫున అదే కార్యాలయం వాదిస్తున్నందున ప్ర‌జ‌ల్లో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌న్నారు.

అన్యాయంపై స్పందించేందుకు..

గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. తాను భావించిన అన్యాయంపై స్పందించేందుకు ఇదే సరైన మార్గమని కేజ్రీవాల్ చెప్పారు. ఈ నిర్ణయం తనకు వ్యక్తిగతంగా న‌ష్టం జ‌రుగుతుంద‌ని, అయినా దానికి సిద్ధంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు మాత్రమే తన నిర్ణయం వర్తిస్తుందని, ఇతర సంబంధం లేని కేసుల్లో అదే న్యాయమూర్తి ముందు హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. అలాగే, తన రిక్యూసల్ పిటిషన్‌ను తిరస్కరించిన ఆదేశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసే హ‌క్కు చేసే హక్కు ఉంద‌న్నారు. త‌న అభ్యంతరం కోర్టుపై కాద‌ని.. ఈ కేసు విచారణ కొనసాగుతున్న విధానంపై మాత్ర‌మేన‌ని కేజ్రీవాల్ లేఖ‌లో స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement