త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyank Kharge | క‌ర్నాట‌క‌లో నాయ‌క‌త్వ మార్పులు.. తోసిపుచ్చిన ప్రియాంక్ ఖ‌ర్గే..!

Priyank Kharge | క‌ర్నాట‌క నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను మంత్రి ప్రియాంక్ ఖర్గే ఖండించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ, ఇది పరిపాలనా ప్రక్రియలో భాగమేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉందని స్పష్టం చేశారు.

P

National | Published On Apr 25, 2026, 8.31 pm IST

Priyank Kharge | క‌ర్నాట‌క‌లో నాయ‌క‌త్వ మార్పులు.. తోసిపుచ్చిన ప్రియాంక్ ఖ‌ర్గే..!
Advertisement

Priyank Kharge | క‌ర్నాట‌క‌లో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు మరోసారి తెరపడింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై చర్చలు జోరందుకున్న నేపథ్యంలో, రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పష్టతనిచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ నాయకత్వ మార్పు గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఉప ముఖ్యమంత్రి శివకుమార్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవడంపై వస్తున్న విమర్శలను కూడా ఆయన ఖండించారు.

ఉప ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలవడం పూర్తిగా రాజ్యాంగ, పరిపాలనా ప్రక్రియలో భాగమని చెప్పారు. బెంగళూరులో పెండింగ్ అభివృద్ధి పనులు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లార‌న్నారు. సాధారణ కార్యకర్తలు సైతం పెద్ద నేతలను కలుస్తారని, అలాంటి సందర్భంలో ఒక ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సమావేశాన్ని వివాదంగా మార్చడం అర్థరహితమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీపై విమర్శలు గుప్పించిన ప్రియాంక్ ఖర్గే, ప్రతి విషయాన్నీ వివాదంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ నాయకుడు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్‌ను కలిస్తే బీజేపీ ఇలాగే ప్రశ్నలు వేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నాయకత్వంపై ఎలాంటి అయోమయం లేదని స్పష్టం చేసిన ఆయన, కాంగ్రెస్ ఒక క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పారు. నాయకత్వ నిర్ణయాలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వంటి అగ్ర నేతల ఆధ్వర్యంలోనే తీసుకుంటార‌ని, ఖర్గే నేతృత్వంలో ఉన్నప్పుడు ఈ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకునే అవకాశం లేద‌న్నారు. ఏప్రిల్ చివర్లో ‘మే విప్లవం’, రాజకీయ మార్పులు జ‌రుగ‌నుంద‌న్న ఊహాగానాల‌ను తోసిపుచ్చారు.

Advertisement
Advertisement