త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lamborghini | పాద‌చారుల‌పైకి దూసుకెళ్లిన లాంబోర్గిని కారు.. వ్యాపారి కుమారుడు అరెస్ట్‌

Lamborghini | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్ (Kanpur)లో ఓ వ్యాపారి కుమారుడు బీభ‌త్సం సృష్టించాడు. త‌న ఖ‌రీదైన లాంబోర్గిని (Lamborghini) కారును అతి వేగంగా న‌డుపుతూ ప‌లు వాహ‌నాల‌ను ఢీ కొట్టాడు.

D

National | Published On Feb 9, 2026, 11.00 am IST

Lamborghini | పాద‌చారుల‌పైకి దూసుకెళ్లిన లాంబోర్గిని కారు.. వ్యాపారి కుమారుడు అరెస్ట్‌
Advertisement

Lamborghini | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్ (Kanpur)లో ఓ వ్యాపారి కుమారుడు బీభ‌త్సం సృష్టించాడు. త‌న ఖ‌రీదైన లాంబోర్గిని (Lamborghini) కారును అతి వేగంగా న‌డుపుతూ ప‌లు వాహ‌నాల‌ను ఢీ కొట్టాడు. ఆ త‌ర్వాత అమాంతం గాల్లో ఎగిరి పాద‌చారుల‌పైకి (pedestrians) దూసుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న గ్యాల్‌టోలి ( Gwal Toli) ప్రాంతానికి స‌మీపంలోని ఎక్స్‌ప్రెస్ రోడ్డులో చోటు చేసుకుంది.

ప్ర‌ముఖ పొగాకు వ్యాపారి ఏకే మిశ్రా (tobacco trader A K Mishr) కుమారుడు శివం (Shivam) త‌న ఖ‌రీదైన లాంబోర్గిని కారులో ప్ర‌యాణిస్తున్నాడు. మ‌ద్యం మ‌త్తులో అత‌డు కారును అతివేగంగా న‌డుపుతూ ప‌లు వాహ‌నాల‌ను ఢీ కొట్టాడు. ఆ త‌ర్వాత కారు ప్ర‌ధాన క్యారేజ్‌వే నుంచి ఫుట్‌పాత్‌పైకి ఎగిరి పాద‌చారుల‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌తో భ‌య‌ప‌డిపోయిన శివం అక్క‌డి నుంచి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. స్థానికులు ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఆ స‌మ‌యంలో త‌న‌కు ఉన్న‌ట్టుండి త‌ల‌తిరిగింద‌ని, మూర్ఛ‌ రావ‌డంతో వాహ‌నంపై ప‌ట్టు కోల్పోయిన‌ట్లు శివం పోలీసుల‌కు చెప్పిన‌ట్లు తెలిసింది.

మ‌రోవైపు ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న ఏకే మిశ్రా త‌న బౌన్స‌ర్ల‌తో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స్థానికుల‌ను బెదిరించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారును స్వాధీనం చేసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement